LIC Guinness Record
LIC Guinness Record : ఇన్సూరెన్స్ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త (LIC Guinness Record) చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే దాదాపు 6 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
Read Also : EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక ప్రకటన.. ఈసారి ఎంతంటే?
ఈ మేరకు ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత జనవరి 20, 2025న ‘మ్యాడ్ మిలియన్ డే’ రోజున 24 గంటల్లో 5,88,107 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను రికార్డు స్థాయిలో విక్రయించింది.
ఏజెన్సీ నెట్‌వర్క్, సర్వీసు సామర్థ్యాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిందని ఎల్‌ఐసీ పేర్కొంది. ఇన్సూరెన్స్ హిస్టరీలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాలసీలను జారీ చేయడం ఇదే మొదటిసారి. ఎల్ఐసీ ప్రకారం.. ఈ రికార్డు 4,52,839 ఏజెంట్ల వల్లే సాధ్యమైంది. దేశవ్యాప్తంగా సమిష్టిగా ఈ ఘనతను సాధించారు.
‘మ్యాడ్ మిలియన్ డే’ కార్యక్రమం :
ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ మొహంతి విజ్ఞప్తితో ఎల్‌ఐసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 20న ప్రతి ఏజెంట్ కనీసం ఒక బీమా పాలసీని పూర్తి చేయాలని ఆయన అభ్యర్థించారు. దీనికి ‘మ్యాడ్ మిలియన్ డే’ అని పేరు పెట్టారు.
ఈ రికార్డు మా బీమా ఏజెంట్ల అవిశ్రాంత కృషి, సామర్థ్యం, సేవా స్ఫూర్తికి ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని ఎల్ఐసీ పేర్కొంది.
ఎల్ఐసీ సీఈఓ సిద్ధార్థ మొహంతి ప్రతి బీమా ఏజెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “మా కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులు చారిత్రాత్మక రోజుగా మార్చారు.
ఈ రికార్డు మా సమిష్టి సంకల్పానికి నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. బీమా రంగంలో పోటీ పెరుగుతున్న సమయంలో ఎల్ఐసీ ఈ రికార్డును సాధించింది.