Vivo X100 Pro : వివో ఫ్యాన్స్ డోంట్ మిస్.. వివో X100 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo X100 Pro : వివో X100 ప్రో మోడల్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Vivo X100 Pro : వివో ఫ్యాన్స్ డోంట్ మిస్.. వివో X100 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo X100 Pro

Updated On : August 22, 2025 / 10:55 AM IST

Vivo X100 Pro : వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ X100 ప్రో ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరతో (Vivo X100 Pro) లభిస్తోంది. గత ఏడాదిలో వివో X100 ప్రో రూ. 89,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా, ఇప్పుడు రూ. 58,500 లోపు ధరకే లభ్యమవుతోంది.

ఈ వివో ఫోన్ పవర్ ఫుల్ డైమిన్షిటీ 9300 చిప్‌సెట్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది. మీరు కూడా ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ కోసం ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ డీల్.. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో వివో X100 ప్రో ధర ఎంతంటే? :
ప్రస్తుతం వివో X100 ప్రో 5G ఫోన్ రూ.59,999కే అమ్మకానికి అందుబాటులో ఉంది. లాంచ్ ధర రూ. 89,999 నుంచి రూ.30వేలు తగ్గింపు పొందింది. అదనంగా, HDFC బ్యాంకు కస్టమర్లు రూ. 1500 తగ్గింపుతో వివో ఫోన్ రూ. 58,499కు ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాదు.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం రూ. 1,799 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Read Also : Savings Scheme : పెట్టుబడిదారులకు పండగే.. ఈ బ్యాంకులో రూ. 2 లక్షలు FD చేస్తే చాలు.. ఏకంగా రూ. 30,908 వడ్డీ పొందొచ్చు.. ఎలాగంటే?

అలాగే, ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 31వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ కేవలం ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్ 16GB ర్యామ్, 512GB స్టోరేజీ మోడల్ పై మాత్రమేనని గమనించాలి.

వివో X100 ప్రో స్పెషిఫికేషన్లు :
వివో X100 ప్రో 5G ఫీచర్లలో 6.78 అంగుళాల LTPO కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో రిఫ్రెష్ రేట్ 120Hz కలిగి ఉంది. హుడ్ కింద డైమన్షిటీ 9300 చిప్‌సెట్, 16GB ర్యామ్, 512GB స్టోరేజీ కలిగి ఉంది. వివో X100 ప్రో ZEISS ట్యూన్డ్ 50MP సోనీ IMX989 సెన్సార్ ఉంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS), 50MP వైడ్ యాంగిల్ కెమెరా, OISతో 50MP టెలిఫొటో లెన్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14తో రన్ అవుతుంది. అదనంగా వివో X100 ప్రో మోడల్ 5,400mAh బ్యాటరీ, 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్టు కలిగి ఉంది.