Gold Rate Today : ఒక్కరోజులోనే తారుమారు.. రికార్డు స్థాయిలో తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర

Gold Rate Today : ఒక్కరోజులోనే తారుమారు.. రికార్డు స్థాయిలో తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..

Gold Rate Today

Updated On : August 22, 2025 / 10:48 AM IST

Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. రెండు వారాల తరువాత గురువారం భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ (Gold Rate Today) మళ్లీ దిగొచ్చింది.

Gold Price

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.220 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 150 తగ్గింది. అయితే, అంతర్జాతీయంగా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ (31.1గ్రాములు) 10డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,328 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు.. వెండి ధరసైతం భారీగా తగ్గింది. గురువారం కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గగా.. ఇవాళ కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 3వేలు తగ్గింది.

Gold Rate Today

అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉధ్రిక్తతలు వంటివి బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయి. అయితే, వచ్చే రెండుమూడు నెలల్లో గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో డిసెంబరు నాటికి పసిడి ఔన్సు (31.1గ్రాములు) ధర 3,600 డాలర్లు (సుమారు రూ.3.13లక్షలు)కు చేరొచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అయితే, ప్రస్తుతానికి గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నెలాఖరు నాటికి బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందన్న వాదన ఉంది.

Gold Rate

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,530 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,680 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,00,530కు చేరింది.

Gold Price

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండిపై రూ.2వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,28,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,18,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,28,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Megastar Chiarnjeevi : చిరంజీవి బర్త్ డే స్పెషల్.. మెగాస్టార్ రేర్ ఫొటోలు చూశారా?