Kiran Abbavaram: తమిళ దర్శకుడితో కిరణ్ భారీ మూవీ.. అనిరుధ్ మ్యూజిక్.. త్వరలోనే అనౌన్స్ మెంట్..

కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ హ్యపెనింగ్ హీరోగా మారిపోయాడు(Kiran Abbavaram). రాజావారు.. రాణిగారు సినిమాతో హీరోగా మారిన కిరణ్ ఆ తరువాత వచ్చిన SR కల్యాణమండపం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు.

Kiran Abbavaram: తమిళ దర్శకుడితో కిరణ్ భారీ మూవీ.. అనిరుధ్ మ్యూజిక్.. త్వరలోనే అనౌన్స్ మెంట్..

Anirudh Ravichander to compose music for Kiran Abbavaram next film

Updated On : October 12, 2025 / 10:53 AM IST

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ హ్యపెనింగ్ హీరోగా మారిపోయాడు. రాజావారు.. రాణిగారు సినిమాతో హీరోగా మారిన కిరణ్ ఆ తరువాత వచ్చిన SR కల్యాణమండపం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అక్కడినుంచి కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్న కిరణ్ మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాలు చేసినా ‘క’ సినిమాతో కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా(Kiran Abbavaram) దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కే-ర్యాంప్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తుండగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun: ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇండియాలోనే టాప్ స్టార్ గా రికార్డ్.. నీయవ్వ తగ్గేదేలే

ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా తన నెక్స్ట్ సినిమా గురించి హిట్ ఇచ్చాడు కిరణ్. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా తమిళ దర్శకుడితో చేయబోతున్నా. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఆ సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నాడు. కథ, టెక్నీషియన్స్ అంతా సెట్ అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫిషీయల్ అనౌన్స్ మెంట్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతి, కిరణ్ అబ్బవరం చేయబోతున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ చేస్తుండటమే. ప్రెజెంట్ అనిరుధ్ మ్యూజిక్ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. పోస్టర్ పై అనిరుధ్ అనే పేరు కనిపిస్తే చాలు ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇండియా వైడ్ గా ఉన్న చాలా మంది స్టార్స్ అనిరుధ్ తో పని చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి, కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క సినిమాతో కిరణ్ అబ్బవరం రేంజ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవడం ఖాయంగా కనిపితోంది. ఈ సినిమా గనక హిట్ అయితే ఇక కిరణ్ అబ్బవరం ను ఆపడం చాలా కష్టం. స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.