Allu Arjun: ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇండియాలోనే టాప్ స్టార్ గా రికార్డ్.. నీయవ్వ తగ్గేదేలే

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు(Allu Arjun). సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది.

Allu Arjun: ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇండియాలోనే టాప్ స్టార్ గా రికార్డ్.. నీయవ్వ తగ్గేదేలే

Iconic star Allu Arjun is taking a record remuneration of Rs. 175 crores for Atlee's film

Updated On : October 12, 2025 / 10:24 AM IST

Allu Arjun: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ.290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ ఇండీస్ట్రీ రికార్డ్ సాధించింది. ఇక ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అని డైలాగ్ చెప్పినట్టుగా ఆయన స్థాయి ఇప్పుడు గ్లోబల్ లెవల్ కి పాకింది.

Prabhas: ట్రెండ్ మారింది గురూ.. సీక్వెల్ కాదు.. ప్రభాస్ కూడా అలానే వస్తున్నాడు

పుష్ప 2 సినిమాలో తన యాక్టింగ్, యాక్షన్, ఎమోషన్స్తో ఆడియన్స్ ఫిదా చేసేశాడు అల్లు అర్జున్. దాంతో, ఇప్పుడు అల్లు అర్జున్ కు డిమాండ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. భారీ నిర్మాణ సంస్థలన్నీ ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే, ఒక్కో సినిమాకు ఒక రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట అల్లు అర్జున్. ఈ విషయంలో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఆయన. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అక్షరాలా రూ.175 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట అల్లు అర్జున్.

ఈ విషయం గురించి ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి. ఈ న్యూస్ తెలిసిన మిగతా హీరోలు నోరెళ్లబెడుతున్నారట. ఇంతకుముందు ఈ రికార్డ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుమీద ఉండేది. ఆయన గత చిత్రాలకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి రూ.175 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకొని ఇండియన్ టాప్ స్టార్ గా నిలిచాడు అల్లు అర్జున్. ఈ న్యూస్ తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రానున్న సినిమా హాలీవుడ్ రేంజ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని, అప్పటివరకు తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం ఒక సౌత్ స్టార్ ఇండియా లెవల్లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది మనవాళ్ళకి గర్వకారణం అనే చెప్పాలి.