Prabhas: ట్రెండ్ మారింది గురూ.. సీక్వెల్ కాదు.. ప్రభాస్ కూడా అలానే వస్తున్నాడు
సినీ ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. కొంతకాలం(Prabhas) ఎమోషనల్ మూవీస్, కొంతకాలం డ్యూయల్ రోల్స్, ఫ్యాక్షనిజం, యాక్షన్, మాఫియా బ్యాక్డ్రాప్ ఇలా చాలా రకాల ట్రెండ్ లు నడిచాయి.

Director Hanu Raghavapudi is planning a prequel to Prabhas' upcoming film Fauji.
Prabhas: సినీ ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. కొంతకాలం ఎమోషనల్ మూవీస్, కొంతకాలం డ్యూయల్ రోల్స్, ఫ్యాక్షనిజం, యాక్షన్, మాఫియా బ్యాక్డ్రాప్ ఇలా చాలా రకాల ట్రెండ్ లు నడిచాయి. ఒక ట్రెండ్ లో ఒక సినిమా అయ్యింది అనే అందరు హీరోలు ఆ జానర్ సినిమాలో సినిమా చేయాలని ఇష్టపడతారు. అలాగే, బాహుబలి సినిమాతో సీక్వెల్ అండ్ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యింది. ప్రెజెంట్ కూడా అదే నడుస్తోంది(Prabhas). దాదాపు స్టార్ హీరోలందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యారు. సినిమాను రెండు పార్ట్స్ గా చేయడం, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం. చాలా సినిమాలు ఇలా వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే, ఇప్పుడు ఆ ట్రెండ్ ఓల్డ్ అయిపోయింది అనుకున్నారో ఏమో.. మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.
ఈ ట్రెండ్ రీసెంట్ గా రిలీజ్ అయినా కాంతర: చప్టార్ 1తో మొదలయ్యింది. ఇంతకీ ఆ ట్రెండ్ మరేదో కాదు. ప్రీక్వెల్ ట్రెండ్. ఇంతకాలం సినిమాలకు సీక్వెల్ ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు అదే కథకు ప్రీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నారు. కాంతర: చప్టార్ 1 సినిమా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక వారంలోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తరువాత ప్రీక్వెల్ ట్రెండ్ లో రాబోతున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ.
ఓజీ సినిమాకు కూడా సీక్వెల్ కాకుండా ముందు ప్రీక్వెల్ చేయాలనీ భావితున్నారట మేకర్స్. ఓజీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ట్యాగ్ తో వచ్చిన ఈ సినిమా కేవలం రీజనల్ గా రిలీజ్ అయ్యి రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో, ఓజీ పార్టీ 2పై భారీగా అంచనాలు నమోదు అవుతున్నాయి. అయితే, ఓజీ2ని సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. దీనిపై ఇటీవలే అధికారిక ప్రకటనా కూడా ఇచ్చేశారు మేకర్స్. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల బాటలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాబోతున్నాడట. ఆయన ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్న విషయం తెల్సింది. ఆర్మీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు కూడా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. సినిమాలో ప్రభాస్ ఆర్మీ మ్యాన్ గా ఎలా మారాడు అనే కథ చాలా పవర్ ఫుల్ గా సెట్ అయ్యిందట. అందుకే ఫౌజీ సినిమాకు పప్రీక్వెల్ ప్లాన్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట దర్శకుడు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఏదిఏమైనా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రీక్వెల్ ట్రెండ్ మొదలయ్యింది. రిజల్ట్ కూడా అదిరిపోయింది కాబట్టి, రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలకు ప్రీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.