Android Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన 5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. ఇందులో ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..

Android Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Android Camera Phones

Updated On : October 11, 2025 / 4:31 PM IST

Android Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే బెటరా? ఆపిల్ ఐఫోన్ కొంటే బెటరా? ఏది కొంటే బెటర్? అని ఆలోచిస్తున్నారా? మీరు ఐఫోన్ 17 ప్రో కొనాలనుకుంటే ఇది మీకోసమే.. ఎందుకంటే.. ఫ్లాగ్‌షిప్ లెవల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఫోన్లలో ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

అందులో ప్రధానంగా శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండ్లు (Android Camera Phones) ఆపిల్ ఇమేజింగ్ ఫీచర్లకు పోటీగా పవర్‌ఫుల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ కెమెరా ఫీచర్లను అందించే ఫోన్లపై ఓసారి లుక్కేయండి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో (5x జూమ్), 8K వీడియో సామర్థ్యంతో 48MP అల్ట్రావైడ్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 42MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా 4K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన వివరాలు, డైనమిక్ రేంజ్ అందిస్తుంది. అడ్వాన్స్ ఇమేజింగ్ 2025లో ఐఫోన్ 17 ప్రో కెమెరాతో గట్టి పోటీనిస్తుంది.

ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా (రూ. 76,000) :
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా ఆకట్టుకునే క్వాడ్ 50MP కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 3x, 6x జూమ్‌ డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌లతో పాటు ఒకఅంగుళాల వెడల్పు సెన్సార్‌ కలిగి ఉంది. హాసెల్‌బ్లాడ్ కలర్ ట్యూనింగ్, డాల్బీ విజన్ 10-బిట్ వీడియోతో ఆకర్షణీయమైన డైనమిక్ రేంజ్ అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రోతో పోటీపడే ఫోన్లలో ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా ఫోన్ కూడా ఒకటి.

Read Also : Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, రియల్‌మి 15 ప్రో ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఈ క్రేజీ డీల్స్ డోంట్ మిస్!

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 98,999) :

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 200MP ప్రైమరీ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 10MP 3x టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో ప్రత్యేకంగా నిలుస్తుంది. 8K రికార్డింగ్, HDR10+కి సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ప్రో-లెవల్ ఇమేజ్, వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రో 50MP ప్రైమరీ లెన్స్, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. జీసిస్ ఆప్టిక్స్, 8K వీడియో సపోర్ట్ ద్వారా ఈ వివో ఫోన్ అద్భుతమైన కలర్ ఆప్షన్ అందిస్తుంది. 2025లో ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు.

ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 99,999) :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ మొత్తం నాలుగు 50MP లెన్స్‌ కలిగి ఉంది. ఇందులో 6x ఆప్టికల్ జూమ్ డ్యూయల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌లు ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ఇమేజింగ్, అడ్వాన్స్‌డ్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో ప్రొఫెషనల్-గ్రేడ్ షాట్‌లను అందిస్తుంది. 2025లో ఐఫోన్ 17 ప్రోకు పవర్‌ఫుల్ కెమెరాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.