Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, రియల్‌మి 15 ప్రో ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఈ క్రేజీ డీల్స్ డోంట్ మిస్!
Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. శాంసంగ్ నుంచి వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకు అందిస్తోంది.

Flipkart Big Bang Diwali Sale
Flipkart Big Bang Diwali Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ మొదలైంది. అధికారికంగా అక్టోబర్ 11వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. గత సేల్ సమయంలో డీల్స్ మిస్ అయితే ఇప్పుడు మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ సేల్‌లో శాంసంగ్, వివో, ఆపిల్, నథింగ్ వంటి (Flipkart Big Bang Diwali Sale) టాప్ బ్రాండ్ల నుంచి లేటెస్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ సభ్యులకు అక్టోబర్ 10 నుంచి అడ్వాన్స్ డీల్స్ అందుబాటులోకి రాగా, అక్టోబర్ 11న ఉదయం 12:00 గంటలకు అందరి యూజర్లకు అధికారికంగా సేల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా అందించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 అత్యల్ప ధర :
ఆపిల్ ఐఫోన్ 16 అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. ఐఫోన్ 16 కేవలం రూ.54,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ధర నుంచి రూ.25వేల వరకు భారీ ధర తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ (3a) మిడ్‌రేంజ్ డిస్కౌంట్ :
ఈ ఏడాదిలో రిలీజైన నథింగ్ మిడ్-బడ్జెట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. మొదట రూ. 24,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ (నథింగ్ 3ఎ) ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో రూ. 20,999కు అందుబాటులో ఉంటుంది. నేరుగా రూ. 4వేలు తగ్గింపుతో నథింగ్ ఫోన్ (3a) 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో సహా పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది.
రియల్‌మి 15 ప్రో బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు :
రియల్‌మి 15 ప్రో కేవలం రూ.26,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్, 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో పవర్ పొందుతాయి.
శాంసంగ్ గెలాక్సీ F36 :
8GB ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ F36 భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ.13,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరిన్ని సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
వివో టీ4ఆర్ 5జీ పర్ఫార్మెన్స్, బ్యాటరీ :
ఈ వివో T4R 5జీ ఫోన్ ధర రూ. 17,499 నుంచి లభిస్తుంది. భారీ 5700mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్, 12GB ర్యామ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ మోడల్‌పై 10శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.