PM Kisan 21st Installment Date : దీపావళికి ముందే పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఈ రైతులకు మాత్రం రూ. 2 వేలు పడవు.. ఎందుకంటే?

PM Kisan 21st Installment Date : దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ 21వ విడత విడుదలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ రైతులకు రూ. 2వేలు పడవు.

PM Kisan 21st Installment Date : దీపావళికి ముందే పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఈ రైతులకు మాత్రం రూ. 2 వేలు పడవు.. ఎందుకంటే?

PM Kisan Yojana

Updated On : October 11, 2025 / 2:56 PM IST

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులను ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా ఏటా 3 విడతలుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ. 6వేలు జమ చేస్తోంది. సాధారణంగా, ఈ వాయిదాలు ప్రతి 4 నెలలకు విడుదల అవుతాయి. 20వ విడత ఆగస్టు 2025లో విడుదల అయింది. నాలుగు నెలల తర్వాత ఈసారి ప్రభుత్వం 21వ విడతను విడుదల చేయనుంది.

ఆ 3 రాష్ట్రాల రైతులకు 21వ విడత :
దేశవ్యాప్తంగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత (PM Kisan 21st Installment Date) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, జమ్మూ కాశ్మీర్, మరో 3 రాష్ట్రాల రైతులకు ఈ నిరీక్షణ ముగిసింది. అక్టోబర్ 7న 21వ విడత వారికి ముందుగానే అందింది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రైతులకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల రైతులను ఆదుకోవడానికి ఈ విడత గడువు కన్నా ముందే విడుదల చేసింది ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యం బారిన పడిన 8.5 లక్షలకు పైగా రైతులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.170 కోట్లకు పైగా క్రెడిట్ అయ్యాయి.

పీఎం కిసాన్ 21వ విడత రిలీజ్ ఎప్పుడంటే? :

2023లో ఈ విడత నవంబర్ 15న విడుదలైంది. 2024లో 18వ విడత అక్టోబర్ 5న విడుదలైంది. గత ఏడాదిలో షెడ్యూల్ ప్రకారం.. 21వ విడత ఈలోగా విడుదలై ఉండాలి. అయితే, ఇప్పటివరకు, ఫండ్స్4 రాష్ట్రాలలోని రైతుల అకౌంట్లలో మాత్రమే క్రెడిట్ అయ్యాయి. అందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలోని రైతులు మాత్రం రూ. 2వేలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!

దీపావళికి ముందే గుడ్‌న్యూస్.. :
వాస్తవానికి, పీఎం కిసాన్ 21వ విడత విడుదలపై కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించలేదు. దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో రూ. 2,000 జమ కావచ్చని అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అంటే ప్రధానమంత్రి కిసాన్ పథకం 21వ విడత ఈ అక్టోబర్ నెలలో లేదా రాబోయే వారాల్లో రూ. 2వేలు పడే అవకాశం ఉంది.

ఈ రైతులు 21వ విడత డబ్బులు పడవు :
ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులు, బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింక్ చేయని రైతులు, IFSC కోడ్ తప్పుగా ఉన్న రైతులు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసిన రైతులు లేదా వ్యక్తిగత వివరాలు మ్యాచ్ కాని రైతులకు 21వ వాయిదా రూ. 2వేలు పడవు. మొత్తంమీద, e-KYC పూర్తి చేసి సరైన డాక్యుమెంట్లను సమర్పించి ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన రైతులకు మాత్రమే ఈ దీపావళికి రూ. 2వేలు అందుకోనున్నారు. అయితే, వారి వివరాలలో ఏదైనా లోపాలు లేదా సమాచారం తప్పుగా ఉంటే మాత్రం ఆయా రైతులకు వాయిదా అందే అవకాశం ఉండదు.

మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? :

  • మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ.
  • అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
  • ‘Farmer Corner’ సెక్షన్‌కు వెళ్లి, ‘Beneficiary List’పై క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
  • ‘Get Report’ పై క్లిక్ చేసి లిస్ట్ చెక్ చేయండి.

మీ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుందో లేదో చెక్ చేయండి :
ఈసారి మీ బ్యాంకు అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుందో లేదో తెలియాలంటే ముందుగా లబ్ధిదారుల జాబితాను చెక్ చేయండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.

  • అధికారిక (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • ”Farmer Corner” ఆప్షన్ ఎంచుకోండి
  • మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
  • ‘Get Report’పై క్లిక్ చేసి మీ పేరు కోసం చెక్ చేయండి.
  • ఈ జాబితాలో మీ పేరు లేకపోతే, 21వ వాయిదా మీ అకౌంట్లో క్రెడిట్ కాదు.