Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!
Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ క్రేజీ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Apple iPhone 16 Plus : దీపావళి పండగ దగ్గరపడుతోంది. కొత్త ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ మోడల్ కొనుగోలుపై ఏకంగా రూ. రూ. 11,910 సేవ్ చేసుకోవచ్చు.

ఐఫోన్‌లో ఈ లెవల్ డీల్స్ చాలా చాలా అరుదు, ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. అయితే, ఇలాంటి డిస్కౌంట్లు సాధారణంగా ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16 ప్లస్ కొనాలని అనుకుంటే వెంటనే కొనేసుకోవడం బెటర్.. ఈ ఆఫర్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపు : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.67,990కి లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ రూ.11,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద, ఈ హ్యాండ్‌సెట్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఇంకా, ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. టెక్ దిగ్గజం ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.