Mappls App : ఇకపై గూగుల్ మ్యాప్స్ ఉండవు.. మన స్వదేశీ నావిగేషన్ యాప్ ‘MAPPLS’ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!

Mappls App : కొత్త స్వదేశీ మ్యాప్ అప్లికేషన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. Mappls అనే ఈ యాప్ ప్రత్యేకంగా భారతీయ యూజర్ల కోసం రూపొందించింది.

Mappls App : ఇకపై గూగుల్ మ్యాప్స్ ఉండవు.. మన స్వదేశీ నావిగేషన్ యాప్ ‘MAPPLS’ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!

Mappls App

Updated On : October 12, 2025 / 12:47 PM IST

Mappls App : ప్రస్తుత రోజుల్లో బయటకు ఎక్కడికి వెళ్లినా గూగుల్ మ్యాప్స్ తెగ వాడేస్తున్నారు. ఇకపై గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.. ఎందుకంటే.. ఇప్పుడు మన భారతీయ సొంత మ్యాప్ యాప్ ‘Mappls’ వచ్చేసింది. విదేశీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.

Mappls అనేది (MapmyIndia) అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ యాప్. ఈ యాప్ (Google Maps) మాదిరిగానే వర్క్ అవుతుంది. ప్రత్యేకించి భారతీయ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ డెవలప్ చేశారు. యూజర్ల డేటా మన దేశీయ సర్వర్లలోనే స్టోర్ అవుతుంది. ప్రైవసీ, సేఫ్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈ యాప్ దేశంలోని రోడ్లు, అనేక మార్గాల గురించి పూర్తి అవగాహన అందిస్తుంది. ఇందులోని అనేక స్పెషల్ ఫీచర్లు రైడర్లకు డ్రైవింగ్, నావిగేషన్‌ చాలా ఈజీగా ఉంటుంది. ఇటీవల, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను ప్రశంసించారు. ఇది “స్వదేశీ” టెక్నాలజీతో వచ్చిన అద్భుతమైన యాప్ అంటూ అభివర్ణించారు.

మ్యాప్‌మైఇండియా అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ యాప్ మాప్ల్స్‌ను మంత్రి అశ్విని వైష్ణవ్ ఉపయోగించారు. ఈ యాప్ ఫీచర్లను ఆయన స్వయంగా ట్రై చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రేపు, అమెరికా GPS లేదా అలాంటి వాటిని మూసివేసినా లేదా గూగుల్ భారత్ నుంచి వెళ్లిపోతే ఇక మన దేశాన్ని ఏదీ ఆపలేదు. మన MapmyIndia ఉంది” అని వర్మ అన్నారు.

‘మాపుల్స్’ ప్రీ-ఇన్‌స్టాలేషన్ మస్ట్ :

గూగుల్ మ్యాప్స్ దేశీయ పోటీదారు మ్యాప్‌మైఇండియా, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ కింద తయారైన స్మార్ట్‌ఫోన్‌లలో మొబైల్ అప్లికేషన్ మాప్ల్స్‌ను ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. న్యూఢిల్లీకి చెందిన ఈ కంపెనీ రోజువారీ డౌన్‌లోడ్ 10 రెట్లు పెరిగాయి. పీఎల్‌ఐ పథకం కింద మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులకు ఫండ్స్ ఇస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ మాదిరిగా ప్రీలోడ్ చేయమని వారికి చెప్పవచ్చునని మ్యాప్‌మైఇండియా మాప్ల్స్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మ అన్నారు.

Read Also : Best Royal Enfield Bikes : కొంటే ఇలాంటి బైక్ కొనాలి బ్రో.. పండగ సీజన్‌లో 5 బెస్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు మీకోసం.. ఏది కొంటారంటే?

మొత్తం 13 ఫీచర్లు :
మాపుల్స్ యాప్ కేవలం నావిగేషన్ టూల్ కాదు.. ఇందులో మొత్తం 13 వరకు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారతీయ రోడ్లు, సంస్కృతి, అవసరాలను అర్థం చేసుకోగలదు. జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు, సేఫ్టీ అలర్ట్స్, ప్రాంతీయ భాషా సపోర్టు వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గ్లోబల్ యాప్‌ల అవసరం ఉండదు. పూర్తిగా స్వదేశీ నావిగేషన్ యాప్ మాపుల్స్ ముఖ్య ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

3D జంక్షన్ వ్యూ :
మాపుల్స్ యాప్ కీలక ఫీచర్లలో లక్షణాలలో ఇదొకటి. ఈ ఫీచర్ ప్రత్యేకంగా భారతీయ రోడ్లు, సంక్లిష్టమైన కూడళ్ల కోసం రూపొందించారు. ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు లేదా మల్టీ-లేన్ కూడళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ స్పష్టమైన లేన్, టర్నింగ్ ఆప్షన్లతో 3డీ వ్యూ, ఫోటో-రియలిస్టిక్ వ్యూ అందిస్తుంది. ఈ ఫీచర్ వెళ్లే రోడ్లు అస్పష్టంగా ఉన్న ప్రాంతాలలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

మల్టీ బుల్డింగ్ నావిగేషన్ :
మీరు మల్టీ బిల్డింగ్ లేదా కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నప్పుడు సరైన అంతస్తుకు నావిగేట్ చేసేందుకు మాపుల్స్ యాప్ సాయపడుతుంది. ఈ ఫీచర్ షాపింగ్ మాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మీరు సరైన స్టోర్‌కు వెళ్లేందుకు వేర్వేరు అంతస్తులను నావిగేట్ చేయాల్సి రావచ్చు.

లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్స్ :
ఈ ఫీచర్ రియల్-టైమ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్‌లను సూచిస్తుంది. మీరు సిగ్నల్‌ దగ్గరగా రాగానే గ్రీన్ సిగ్నల్ కనిపించడానికి ఎన్ని సెకన్లు పడుతుందో యాప్ మీకు తెలియజేస్తుంది. డ్రైవింగ్‌ సమయంలో ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో ఈ ఫీచర్ ఈజీగా ఉంటుంది.

టోల్ సేవింగ్స్, రూట్ ఆప్టిమైజేషన్ :

టోల్ ప్లాజాలు, ధరల గురించి రియల్ టైమ్ డేటాను అందించేందుకు మాపుల్స్ యాప్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ టోల్-ఫ్రీ మార్గాలను కూడా సూచిస్తుంది. మీ సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.

సేఫ్టీ అలర్ట్స్ :
డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. మాపుల్స్ యాప్ రోడ్లపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ కెమెరాల గురించి రియల్ టైమ్ అలర్ట్స్ అందిస్తుంది. ఈ అలర్ట్స్ మీరు సురక్షితంగా డ్రైవ్ చేసేలా ప్రమాదాలను నివారించడంలో సాయపడుతుంది.

మాపుల్స్ పిన్ :
మాపుల్స్ పిన్ అనేది ఒక లొకేషన్ గుర్తించే 6-అంకెల కోడ్. సంక్లిష్టమైన అడ్రస్ సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఉదాహరణకు.. 237, ఓఖ్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫేజ్ 3 కోసం ‘mmi000’ అని టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయొచ్చు. ఈ ఫీచర్ డెలివరీ సర్వీసులు, టాక్సీ డ్రైవర్లు, సాధారణ యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

డిజిటల్ అడ్రసింగ్ :
మాపుల్స్ యాప్ డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్ అందిస్తుంది. ప్రామాణిక అడ్రస్ బదులుగా డిజిటల్ కోడ్‌ను ఉపయోగిస్తుంది. అడ్రస్ వివరాలు స్పష్టంగా లేని ప్రాంతాల్లో ఈ సిస్టమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

లోకల్ లాంగ్వేజీ సపోర్టు :
మాపుల్స్ యాప్ ప్రాంతీయ భాషకు సపోర్టు అందిస్తుంది. హిందీ, తమిళం, తెలుగు, ఇతర భారతీయ భాషలలో నావిగేట్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. ఇంగ్లీష్ తెలియని వారికి ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇస్రో ఇంటిగ్రేషన్ :
మాపుల్స్ యాప్ ఇస్రో (ఇండియన్)తో భాగస్వామ్యంతో పనిచేస్తుంది. శాటిలైట్ ఫొటోలు, ల్యాండ్ సంబంధిత డేటాను అందిస్తుంది.

ట్రాకింగ్, షేరింగ్ :

మాపుల్స్ యాప్‌లో మీ లొకేషన్ రియల్ టైమ్ షేర్ చేసేందుకు ట్రాకింగ్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఫీచర్ మీ ప్రయాణానికి సంబంధించి సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేకంగా షేర్ చేయొచ్చు.

కస్టమైజడ్ డైరెక్షన్స్ :
మీ అవసరాలకు అనుగుణంగా యాప్‌లోని మార్గాలను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు టోల్-ఫ్రీ మార్గాలను కోరుకున్నా లేదా షార్ట్ వే ఎంచుకున్నా మాపుల్స్ యాప్ మీకు అనేక ఆప్షన్లను అందిస్తుంది.

Read Also : Apple iPhone 16 Price : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

డేటా సార్వభౌమాధికారం :
మాపుల్స్ యాప్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందింది. ఇందులో యూజర్ల డేటా భారతీయ సర్వర్లలోనే స్టోర్ అవుతుంది. వినియోగదారుల డేటా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఏ విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

ఆఫ్‌లైన్ మ్యాప్స్ :
మాపుల్స్ యాప్ ఆఫ్‌లైన్ మ్యాప్‌ కూడా యాక్సస్ అందిస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా మీరు నావిగేషన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ గ్రామీణ ప్రాంతాలు, తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలలో ప్రత్యేకంగా ఉంటుంది.

ప్రయాణ ఖర్చు కాలిక్యులేటర్ :
ఫ్యూయల్ + టోల్ ఖర్చులను ముందుగానే తెలుసుకోవచ్చు. ఎన్‌హెచ్ఏఐ FASTag వార్షిక పాస్ లేదా మీ వాహనం, ఫ్యూయిల్ టైప్ ఆధారంగా సేవింగ్స్ కూడా సూచిస్తుంది.

సేఫ్ డ్రైవింగ్ :
మీ డ్రైవింగ్ స్పీడ్ గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. ప్రమాదకరమైన రోడ్లను ముందుగానే మీకు అలర్ట్స్ పంపుతుంది.