Sai Durga Tej: అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. నాకు చాలా గర్వంగా ఉంది: సాయి దుర్గ తేజ్

అల్లు అర్జున్ ని చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్(Sai Durga Tej). తాజాగా ఆయన హైదరాబాద్ లో జరిగిన ప్రముఖ ఈవెంట్ కి హాజరయ్యారు.

Sai Durga Tej: అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. నాకు చాలా గర్వంగా ఉంది: సాయి దుర్గ తేజ్

Sai Durga Tej's comments on Allu Arjun are going viral on social media.

Updated On : October 12, 2025 / 11:48 AM IST

Sai Durga Tej: అల్లు అర్జున్ ని చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్. తాజాగా ఆయన హైదరాబాద్ లో జరిగిన ప్రముఖ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయనను అల్లు అర్జున్ గురించి చెప్పుమనగా పైవిదంగా స్పందించాడు. (Sai Durga Tej)దీంతో, చాలా గ్యాప్ తరువాత సాయి దుర్గ తేజ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా తన ఫ్రెండ్ అయిన శిల్ప రవికి సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

Kiran Abbavaram: తమిళ దర్శకుడితో కిరణ్ భారీ మూవీ.. అనిరుధ్ మ్యూజిక్.. త్వరలోనే అనౌన్స్ మెంట్..

ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. ఇక అప్ప్పటినుంచి మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, ఎక్కడ కూడా ఈ రెండు ఫ్యామిలీలకు సంబందించిన వారు మాత్రం స్పందించలేదు. అంతేకాదు, మధ్యలో జరిగిన కార్యక్రమాలకు ఇరు కుటుంబసభ్యులు సైతం హాజరవుతూ వచ్చారు. ఇక పుష్ప 2 సినిమా తరువాత అల్లు అర్జున్ రేంజ్ గ్లోబల్ లెవల్ కి చేరుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాదించి రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపధ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ గురించి స్పందించాడు మెగా హీరో సాయి దుర్గ తేజ.

ఆయన తాజాగా హైద‌రాబాద్‌లో జరిగిన జ‌న్‌-జ‌డ్ ఆటో ఎక్స్‌పో కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్క‌డికి వ‌చ్చిన విద్యార్థుల‌తో కాసేపు ముచ్చ‌టించాడు. అందులో ఒకరు అల్లు అర్జున్ గురించి ప్ర‌శ్న అడిగారు. దానికి బ‌దులిస్తూ సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ అల్లు అర్జున్‌ను గారు అని సంబోదించాడు. అల్లు అర్జున్ గారు సూపర్. చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయ‌న‌ ఇప్పుడు ఇండియాలని బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరు. ఆయ‌న విష‌యంలో నేను చాలా హ్యాపీ, గ‌ర్వంగా కూడా ఫీల‌వుతున్నా”అంటూ చెప్పుకొచ్చాడు తేజు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.