LIC Health Shield Plan : అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే క్షణాల్లో చేతికి డబ్బులు.. LIC హెల్త్ షీల్డ్ పాలసీ పూర్తి వివరాలివే..
LIC Health Shield Plan : ఆసుపత్రిలో చేరాల్సి వస్తే చికిత్స ఖర్చులు సామాన్యులు భరించలేని పరిస్థితి.. అందుకే ఎల్ఐసీ అందించే హెల్త్ షీల్డ్ ప్లాన్ 907 పాలసీ వివరాలు తెలుసుకోండి. ఆసుపత్రి ఖర్చులకు క్యాష్ బెనిఫిట్స్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, అర్హతలు, పాలసీ టెన్యూర్, ప్రీమియం వివరాలేంటో తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- October 17, 2026 / 07:30 PM IST
LIC Health Shield Plan
- అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులా? ఎల్ఐసీ హెల్త్ షీల్డ్ ప్లాన్తో ఊరట
- కుటుంబ ఆరోగ్య ఖర్చులకు అండగా పాలసీ.. ఎవరు తీసుకోవచ్చంటే?
- క్రిటికల్ ఇల్నెస్, సర్జరీకి ఒకేసారి నగదు.. హెల్త్ షీల్డ్ ప్రత్యేకతలివే
LIC Health Shield Plan : ఆరోగ్యం ఎప్పుడు ఎలా దెబ్బతింటుందో చెప్పలేం. అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే చికిత్స ఖర్చులు ఫ్యామిలీ ఇంటి బడ్జెట్ను తలకిందులు చేస్తాయి. ఇలాంటి సమయంలో బీమా పాలసీలు ఆర్థికంగా అండగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హెల్త్ షీల్డ్ ప్లాన్ (Plan No. 907) గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆస్పత్రిలో చేరితే క్యాష్ బెనిఫిట్స్ :
ఎల్ఐసీ హెల్త్ షీల్డ్ ప్లాన్లో భాగంగా పాలసీ నిబంధనలకు అనుగుణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయితే నిర్ణీత మొత్తంలో క్యాష్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఒకేసారి లంప్సమ్ బెనిఫిట్, అలాగే ప్రధాన సర్జరీల సందర్భంలోనూ ఒకేసారి డబ్బులు కట్టలేనివారు ఆర్థిక ప్రయోజనం అందించేలా ఈ ప్లాన్ను రూపొందించినట్లు ఎల్ఐసీ పేజీ చెబుతోంది. ఈ బెనిఫిట్స్ వైద్య ఖర్చుల భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
ఎవరు ఈ పాలసీ తీసుకోవచ్చు? :
అందిన సమాచారం ప్రకారం.. పెద్దలకు 18 నుంచి 65 ఏళ్ల వరకు, పిల్లలకు 90 రోజుల నుంచి 20 ఏళ్ల వరకు ఎంట్రీ ఏజ్ వర్తిస్తుంది. ఈ పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు కాగా, ప్రీమియం పేమెంట్ టెన్యూర్ కూడా 15 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ తీసుకునే ముందు కుటుంబ సభ్యుల వయస్సు, ప్రస్తుత కవరేజీ, ప్రీమియం మొత్తం, బెనిఫిట్స్ సంబంధించిన షరతులను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఎక్కడ అప్లయ్ చేసుకోవాలి? :
ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ లేదా ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ప్రీమియంలను ఆన్లైన్లో పేమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు అధికారిక పాలసీ డాక్యుమెంట్లను పరిశీలించి, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ నిబంధనలను చెక్ చేసుకోవాలి.
Note : ఈ ఎల్ఐసీ ప్లాన్కు సంబంధించిన బెనిఫిట్స్, అర్హతలు, ప్రారంభ తేదీ వంటి వివరాలను ఎల్ఐసీ అధికారిక సైట్లలో వెరిఫై చేసిన తర్వాతే పాలసీ తీసుకోవడం ఎంతైనా మంచిది.
