LIC Kanyadaan Policy : ఆడపిల్లల కోసం కన్యాదాన్ పాలసీ.. పెళ్లి అయినా, చదువు అయినా LICలో రూ. 27 లక్షల వరకు గ్యారెంటీ..
LIC Kanyadaan Policy : కుమార్తెల చదువు, పెళ్లి కోసం కన్యాదాన్ పాలసీని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మారుతోంది. నెలకు సుమారు రూ. 3,596 ప్రీమియంతో మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 27 లక్షల రాబడిని పొందవచ్చు. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published On : March 20, 2026 / 04:58 PM IST
LIC Kanyadaan Policy
- ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎల్ఐసీలో కన్యాదాన్ పాలసీ
- నెలకు రూ. 3,596 ప్రీమియంతో రూ. 27 లక్షల రాబడి
- తండ్రి మరణిస్తే ప్రీమియం మాఫీ అవుతుంది
- తండ్రి వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి
- కుమార్తెకు కనీసం ఒక ఏడాది వయస్సు ఉండాలి
LIC Kanyadaan Policy : మీకు ఆడపిల్ల పుట్టిందా? ఇప్పటినుంచే ఏదైనా గ్యారెంటీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. మీ కుమార్తె చదువులు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ప్రస్తుత రోజుల్లో పెళ్లి, చదువుల ఖర్చులకు తల్లిదండ్రుల ఆందోళనలు అధికమయ్యాయి.
ఎల్ఐసీ పాలసీలో చేరడం ద్వారా మీరు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. ఈ కన్యాదాన్ పాలసీతో తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువు, వివాహానికి ఆర్థిక భద్రతను కల్పించుకోవచ్చు. కుమార్తె భవిష్యత్తు కోసం దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పాలసీ అద్భుతమైన ఆప్షన్.
పాలసీదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక ప్రీమియంలను చెల్లించే అవకాశం ఉంది. నెలవారీ వాయిదాగా రూ. 3,596 చెల్లించడం ద్వారా పాలసీదారులు భవిష్యత్తులో తమ కుమార్తె వివాహం, విద్య కోసం సుమారుగా రూ. 27 లక్షలు పొందవచ్చు. ఒకవేళ ప్రీమియంను త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో చెల్లిస్తే వారు వరుసగా రూ. 10,787, రూ. 21,340, రూ. 42,209 చెల్లించాల్సి ఉంటుంది.
తండ్రి మరణిస్తే ప్రీమియం మాఫీ :
ఈ పథకం తల్లిదండ్రులకు కుమార్తె విద్య, వివాహం కోసం ఆర్థిక భద్రతను అందిస్తుంది. పాలసీ కాలపరిమితి 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. 22 ఏళ్ల వయస్సు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
తండ్రి మరణానంతరం కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. భవిష్యత్ ప్రీమియంలు మాఫీ అవుతాయి. మెచ్యూరిటీ సమయంలో బోనస్‌లతో సహా మొత్తం సుమారు రూ. 27 లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకం కింద తండ్రి వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కుమార్తెకు కనీసం ఒక ఏడాది వయస్సు ఉండాలి.
ఆర్థిక భద్రతతో భవిష్యత్తు సురక్షితం :
ఈ ఎల్ఐసీ పథకం ఆర్థిక భద్రతను అందిస్తుంది. కుమార్తె భవిష్యత్తు సురక్షితంగా ఉందని తల్లిదండ్రులకు భరోసా ఇస్తుందని LIC ఇన్సూరెన్స్ అడ్వైజర్ కేదార్ కుమార్ వివరించారు. కన్యాదాన్ పాలసీ ద్వారా తల్లిదండ్రులు భవిష్యత్తులో వచ్చే ఊహించని ఖర్చులను అధిగమించవచ్చు. కుమార్తె విద్య, వివాహం కోసం సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి.
