Best 7-Seaters Cars : ఫ్యామిలీకి సేఫ్, కంఫర్ట్‌కు టాప్.. రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ 7-సీటర్ కార్లు!

Best 7-Seaters Cars : మీ ఫ్యామిలీ కోసం 7-సీటర్ కారు కొనాలని అనుకుంటే మీ బడ్జెట్ ధరలో రూ. 10 లక్షల వరకు కొనేసుకోవచ్చు. 7-సీటర్ కార్లు ఏయే మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Best 7-Seaters Cars

  • బడ్జెట్‌లోనే లగ్జరీ ఫీల్.. టాప్ 7-సీటర్ కార్లు మీకోసమే
  • ఫ్యామిలీ ట్రిప్స్‌కి బెస్ట్ కార్లు అంటే ఇవే తీసుకుంటారు
  • కంఫర్ట్, మైలేజ్, స్పేస్, పెద్ద ఫ్యామిలీకి సరైన కార్లు
  • రూ.10 లక్షలలోపు కొనదగ్గ 7-సీటర్ కార్లు

Best 7-Seaters Cars : మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ ఎక్కువగా వెళ్తుంటారా? అయితే మీరు 7 సీటర్ కారు తీసుకోవడమే బెటర్..
ఎందుకంటే.. 7-సీటర్ కార్లు చాలా కంపర్టబుల్‌గా ఫ్యామిలీతో కూర్చోగలిగేలా ఉంటాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక అద్భుతమైన 7-సీటర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ. 10 లక్షల బడ్జెట్‌లో మీరు (Best 7-Seaters Cars) కొనుగోలు చేసే టాప్ ఐదు 7-సీటర్ కార్లలో మారుతి సుజుకి, రెనాల్ట్, మహీంద్రా కార్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

నిస్సాన్ గ్రావిటే :
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. భారత మార్కెట్లోనే అత్యంత సరసమైన 7-సీటర్ కారు నిస్సాన్ గ్రావైట్‌ను కొనుగోలు చేయొచ్చు. నిస్సాన్ గ్రావైట్ ధర రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్లు, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Ather EL Electric Scooter : వారెవ్వా.. ఏథర్ ఫస్ట్ EL ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

రెనాల్ట్ ట్రైబర్ :
మీ బడ్జెట్‌లో రెనాల్ట్ ట్రైబర్‌ను కొనుగోలు చేయొచ్చు. రెనాల్ట్ ట్రైబర్ ధర రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త జనరేషన్ ట్రైబర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎత్తును అడ్జెస్ట్ చేయగల డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో :
మంచి SUV కారు కోసం చూస్తున్నారా? కొత్త మహీంద్రా బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తోంది. కొత్త మహీంద్రా బొలెరోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదరెట్ సీట్లు, కొత్త మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో :
మహీంద్రా బొలెరో నియో కూడా అద్భుతమైన ఆప్షన్. మహీంద్రా బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎస్‌యూవీ 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. 100bhp, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతీ సుజుకి ఎర్టిగా :
భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి వచ్చిన 7-సీటర్ కారు ఎర్టిగా మోడల్.. మీ ఫ్యామిలీకి సరసమైన కారు. ఎర్టిగా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.80 లక్షలు. ఈ కారు అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ కారు సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.