PAN Card Rules : మీ పాన్ కార్డు పోయిందా? మార్పులు చేయాలా? కొత్త CBDT రూల్స్ షాక్… చిన్న మిస్టేక్ చేసినా భారీ ఫైన్!
PAN New Rules : ఏప్రిల్ 1, 2026 నుంచి CBDT కొత్త పాన్ సవరణ నిబంధనలను అమలులోకి తెచ్చింది. కొత్త ఫారాలు, ఆధార్ అనుసంధానం, కఠినమైన డాక్యుమెంటేషన్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.
- Sreehari A
- Published On : April 4, 2026 / 06:49 PM IST
PAN New Rules ( Image Credit to Original Source)
- ఏప్రిల్ 1, 2026 నుంచి పాన్ సవరణల కోసం ఏ కొత్త ఫారాలు తప్పనిసరి?
- పాన్ సవరణల కోసం ప్రభుత్వం ఆధార్ లింక్ ఎందుకు తప్పనిసరి చేసింది?
- పాన్ కార్డు పోయినా లేదా మార్పులు చేసినా ఈ డాక్యుమెంట్లు సమర్పించాలి
PAN New Rules 2026 : పన్ను చెల్లింపుదారులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీ పాన్ కార్డు పొగొట్టుకున్నారా? లేదా కార్డులో ఏదైనా తప్పుగా ఉందా? అయితే, పాన్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మీ పాన్ కార్డు రికార్డులో వివరాలను మార్చుకోవాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై సవరించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఆదాయపు పన్ను నియమాలు 2026 కింద ఈ మార్పులు అమల్లోకి తెచ్చింది. పాన్ సవరణలపై సిస్టమ్స్ డైరెక్టరేట్ పూర్తి అధికారం ఉంటుంది. మీ పాన్ డేటాలో తప్పులు లేకుండా చూడటం, నిబంధనల పాటించేలా చేయడం, అలాగే వ్యక్తులు, బిజినెస్ కోసం వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీ చేయడం వంటి చర్యలు చేపట్టనుంది.
పాన్ సవరణ నిబంధనలలో మార్పులేంటి? :
కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు మార్పుల కోసం పాత ఫారమ్‌లను ఇకపై వాడలేరు. ఇందుకోసం CBDT రెండు నిర్దిష్ట ఫారమ్‌లను ప్రవేశపెట్టింది.
- పాన్ CR-01 : వ్యక్తిగత దరఖాస్తుదారుల కోసం
- పాన్ CR-02 : కంపెనీలు, సంస్థలు ట్రస్టుల వంటి వ్యక్తులు కాని వారి కోసం
- పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలలో మార్పు వంటి ఏ విధమైన సవరణకైనా ఈ ఫారాలు ఇప్పుడు తప్పనిసరి.
దరఖాస్తుదారులు పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ, అడ్రస్ వివరాలు, తల్లిదండ్రుల సమాచారంతో సహా అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి. ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఇప్పుడు వ్యక్తులు (సింగిల్ పర్సన్) పాన్ కార్డుపై తమ తండ్రి పేరు లేదా తల్లి పేరు ఉండాలా? అనేది మీరే ఎంచుకోవాలి.
ఇకపై పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి :
పాన్ కార్డులో మార్పుల కోసం ఆధార్ తప్పనిసరి. చాలా మంది దరఖాస్తుదారులు ఇప్పుడు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా తమ ఆధార్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని కేటగిరీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉండవచ్చు. చాలా మందికి ఏదైనా సవరణ అభ్యర్థనను ప్రాసెస్ చేసేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి అవుతుంది.
పాన్ సవరణకు అవసరమైన డాక్యుమెంట్లు :
కొత్త నిబంధనలతో డాక్యుమెంట్ల రిక్వెర్ట్‌మెంట్స్ కూడా కఠినతరంగా మారింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇలా ఉంటాయి.
- ఐడెంటిటీ ప్రూఫ్
- అడ్రస్ ప్రూఫ్
- బర్త్‌డే సర్టిఫికేట్
పాన్ కార్డులో మార్పులకు సంబంధించి సపోర్టు డాక్యుమెంట్లు :
పాన్ కార్డు పోగొట్టుకున్న సందర్భంలో దరఖాస్తుదారులు ఇప్పుడు అప్లికేషన్ తో పాటు FIR కాపీని కూడా సమర్పించాలి.
కొత్త ఫారం నింపే నియమాలివే :
తప్పులు లేకుండా పాన్ కార్డు రిజెక్ట్ కాకుండా ఫారాలను ఎలా నింపాలో CBDT అనేక సూచనలు చేసింది.
- ఫారాలను ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌తోనే నింపాలి.
- బ్లాక్ కలర్ పెన్ మాత్రమే ఉపయోగించండి
- ప్రతి బాక్సులో ఒకే లెటర్ ఉండాలి
- లెటర్స్ మధ్య సరైన గ్యాప్ కోసం ఖాళీలు వదలండి
దరఖాస్తుదారులు తప్పనిసరిగా వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో రెండు రీసెంట్ ఫొటోలను (4.5 సెం.మీ x 3.5 సెం.మీ) జతచేయాలి. అందులో ఎడమ ఫొటోపై సంతకం లేదా వేలిముద్ర ఉండాలి. అయితే, కుడి ఫొటోపై ఎలాంటిది ఉండకూడదు. చాలా క్లీన్ గా ఉండాలి. బొటనవేలితో వేలిముద్ర పెడితే మేజిస్ట్రేట్, నోటరీ పబ్లిక్, గెజిటెడ్ అధికారి లేదా స్టాండర్డ్ కమిషనర్ ధృవీకరించాలి.
పాన్ కార్డులో మార్పుల కోసం ఎలా అప్లయ్ చేయాలి? :
పన్ను చెల్లింపుదారులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా పాన్ కార్డులో సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ : యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL) లేదా ప్రోటీన్ ఇ-గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా నిర్వహించే పాన్ సర్వీసు సెంటర్లను విజిట్ చేయండి.
ఆన్‌లైన్ : ఈ ఏజెన్సీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా పాన్ కార్డులో మార్పుల కోసం రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి.
దరఖాస్తుదారులు ఫారంలోని సంబంధిత ఫీల్డ్‌లను టిక్ చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో పాటు అప్ డేట్ చేసిన వివరాలను అందించాలి. ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డూప్లికేట్ పాన్ కార్డ్ కావాలనుకునే వారి కోసం స్పెషల్ ఆన్‌లైన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ కీలక మార్పులు ఎందుకంటే? :
పాన్ కార్డు సవరణ విధానంతో పన్ను చెల్లింపుదారుల వివరాలు ఒకేలా ఉంటాయి. డాక్యుమెంటేషన్, ఆధార్ ధృవీకరణ స్టాండర్డ్ ఫారమ్‌లను ప్రవేశపెట్టడం ద్వారా పన్ను పరిపాలన మరింత మెరుగుపరుడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే, పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డు కోసం అప్లయ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు చేసినా కూడా మీ పాన్ కార్డు రాదు.. ఆదాయపు పన్ను శాఖ కూడా మీ ఆదాయంపై కన్నేసి ఉంచుతుంది.. ఏ చిన్న తప్పు దొరికినా భారీ మూల్యం చెల్లించక తప్పదు.
