TDS Exemption Rules : సీనియర్ సిటిజన్లకు కొత్త రూల్స్.. జీరో ట్యాక్స్ ఉన్నా TDS కట్ అవుతుందా? ఫారం 121తో ఇలా సేవ్ చేసుకోండి..
TDS Exemption Rules : పన్నుచెల్లింపుదారులు, సీనియర్ సిటిజన్లకు బిగ్ న్యూస్.. ఇకపై అన్నింటికి ఒకటే ఫారమ్.. ఫారమ్ 15హెచ్ ఎత్తేశారు. ఆ స్థానంలో ఫారమ్ 121 వచ్చేసింది. ఎలా ఫిల్ చేయాలి? ప్రయోజనాలేంటి?
Form 15H - Form 121 ( Image Credit : Gemini AI )
- సీనియర్ సిటిజన్ల కోసం కొత్త టీడీఎస్ నిబంధనలు అమల్లోకి
- 60 దాటినవారికి బిగ్ అలర్ట్.. ఫారం 15H రద్దు.. ఇప్పుడు ఏం చేయాలంటే?
- బ్యాంక్‌లో TDS కట్ కాకుండా ఉండాలంటే కొత్త Form 121 ఎలా ఫిల్ చేయాలి?
TDS Exemption Rules – Form 121 : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అప్డేట్.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను నిబంధనలు 2026 తప్పక తెలుసుకోవాలి. టీడీఎస్ నుంచి మినహాయింపును క్లెయిమ్ చేసుకునే విధానంలో కీలక మార్పును ప్రభుత్వం తీసుకొచ్చింది.
టీడీఎస్ మినహాయింపు నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనల్లో మార్పుతో వడ్డీ ఆదాయం వంటి రాబడిపై టీడీఎస్ మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఎప్పుడూ వాడే ఫారం 15H ఇక ఉండదు. ఈ ఫారం స్థానంలో ఫారం 121 అనే కొత్త సింగిల్ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టారు.
గతంలో, 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదారులు ఫారం 15Gని వాడేవారు. అయితే, సీనియర్ సిటిజన్లు ఫారం 15Hని వాడేవారు. ఫారం 121 ప్రవేశపెట్టడంతో ఈ వయస్సు ఆధారిత వ్యత్యాసాన్ని తొలగించారు. ఆర్థిక సంవత్సరానికి మొత్తం పన్ను బాధ్యత జీరోగా ఉన్న వ్యక్తులందరికీ ఈ కొత్త ఫారం ఒకే డిక్లరేషన్‌గా ఉంటుంది. రెండు పాత ఫారమ్‌లను ఒకే స్టాండర్డ్ ఫార్మాట్లో ఇవ్వడం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు అంచనా వేసిన మొత్తం ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కన్నా తక్కువగా ఉంటే.. అర్హత గల ఆదాయంపై టీడీఎస్ మినహాయించవద్దని బ్యాంకులకు ఇతర సంస్థలకు తెలియజేసేందుకు ఈ ఫారం 121ని ఉపయోగించవచ్చు.
ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, రికరింగ్ డిపాజిట్లు, డివిడెండ్లు, అద్దె ఆదాయం, కొన్ని బీమా లేదా ఈపీఎఫ్ సంబంధిత పేమెంట్లు వంటి వనరుల నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది.
UNI నెంబర్‌తో ట్రాకింగ్ :
కొత్త పన్ను చట్టం ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ప్రతి ఫారం 121 సమర్పణకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN)ను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్య వివిధ సంస్థలలో డిక్లరేషన్లను ట్రాక్ చేసేందుకు వీలుంటుంది.
పన్ను వ్యవస్థలో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ ఫైలింగ్‌లను క్రమానుగతంగా నివేదించాల్సి ఉంటుంది. తద్వారా టీడీఎస్ క్లెయిమ్‌లలో తప్పులు, పొరపాట్లు క్రమంగా తగ్గుతాయి.
పన్ను నిబంధనలు సులభతరమే కానీ.. :
పన్ను నిబంధనలు సులభతరం చేసినా అర్హత నిబంధనలు మాత్రం కఠినంగానే ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం మినహాయింపు పరిమితిలో ఉందని ముందుగా కన్ఫార్మ్ చేసుకోవాలి.
అదనంగా, పాన్ (PAN Card) తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి యాక్టివ్‌గా ఉండాలి. లేదంటే డిక్లరేషన్ చెల్లదు. ఫలితంగా హై టీడీఎస్ (TDS) కోతలు తప్పవు. డిక్లరేషన్ వెరిఫికేషన్ కోసం పన్ను చెల్లింపుదారులు అన్ని వనరుల నుంచి అంచనా వేసిన ఆదాయంతో సహా తమ ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది.
చిన్న పొరపాట్లు.. భారీ పెనాల్టీలు.. :
ఫారం 121 దాఖలు సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆలస్యంగా టీడీఎస్ సమర్పించడం, ఆదాయాన్ని తప్పుగా అంచనా వేయడం, ప్రతి చెల్లింపుదారునికి వేర్వేరు డిక్లరేషన్లు దాఖలు చేయకపోవడం, పాన్-ఆధార్ లింక్ చేయకపోవడం వంటివి సాధారణ తప్పులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పొరపాట్ల కారణంగా అనవసరమైన పన్ను కోతలు, జరిమానాలు లేదా పన్ను అధికారుల పరిశీలనకు దారితీస్తుంది.
వాస్తవానికి, ఫారం 121కి మారడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. టీడీఎస్ మినహాయింపు నుంచి పూర్తి ప్రయోజనం కోసం పన్ను చెల్లింపుదారులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు సకాలంలో డిక్లరేషన్లను దాఖలు చేయడం ఎంతైనా మంచిది.
సీనియర్ సిటిజన్లు ఏం చేయాలి?
- మీ మొత్తం ఇన్కమ్ (ఎఫ్ డీ వడ్డీ, పెన్షన్) చెక్ చేయండి
- ట్యాక్స్ జీరో వస్తే మాత్రమే ఫారమ్ 121 ఫిల్ చేయండి
- బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫార్మ్కి సబ్మిట్ చేయండి
- ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఫిల్ చేయడం బెటర్
