Best Mileage Bikes : కొంటే ఇలాంటి బైకు కొనాలి.. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే 5 బైకులివే.. ఏ బైకు ధర ఎంతంటే?
Best Mileage Bikes : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో రూ. 90వేల లోపు ధరలో అత్యధిక మైలేజీని అందించే బైకులు ఉన్నాయి. ఇందులో ఏది కొంటే బెటరంటే?
- Sreehari A
- Updated on- June 10, 2026 / 08:05 PM IST
Best Mileage Bikes ( Image Credit : AI )
- ధర తక్కువ.. అధిక పర్ఫార్మెన్స్ కోసం బైకు కావాలా?
- రూ. 90వేల లోపు హై మైలేజీని ఇచ్చే బెస్ట్ బైకులివే
- హీరో స్ల్పెండర్ నుంచి హోండా ఎస్పీ 125 వరకు ఏది బెస్ట్?
Best Mileage Bikes : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? ధర తక్కువలో మంచి మైలేజీ ఇచ్చే బైకుల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ఖర్చులను భరించలేని చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ బైకుల వైపు మొగ్గుచూపుతున్నారు.
అయినప్పటికీ పెట్రోల్ బండ్లకు మార్కెట్లో ఎంతమాత్రం డిమాండ్ తగ్గలేదు. అందులో మంచి మైలేజీ అందించే బైకులకు ఇంకా క్రేజ్ ఉంది. మీరు కూడా తక్కువ తక్కువ బడ్జెట్ ధరలో మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తుంటే ఈ ఐదు బైకులను ఓసారి చూడండి..
2026లో రూ. లక్ష లోపు అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకుల రేసులో ఈ 5 బైక్‌లు ముందుంటాయి. అందులో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 110, టీవీఎస్ స్పోర్ట్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హోండా ఎస్‌పీ 125 ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో కేవలం రూ. 57,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఈ బైకుల ధర, స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలిద్దాం..
హీరో స్ప్లెండర్ ప్లస్ :
మంచి మైలేజ్ కోరుకునే వారికి హీరో స్ప్లెండర్ ప్లస్ బెస్ట్ ఆప్షన్. 97.2cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ OHC ఇంజిన్‌తో రన్ అవుతుంది. 70 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వేరియంట్‌ను బట్టి ఎక్స్-షోరూమ్ ధర రూ. 77,557 నుంచి ప్రారంభమై రూ. 80,331 వరకు ఉంటుంది. రోజూ ఆఫీసుకు వెళ్లేవారికి లేదంటే మార్కెట్‌కు వెళ్లేవారికి స్ప్లెండర్ ప్లస్ టాప్ రేంజ్ ఆప్షన్లలో ఒకటిగా చెప్పొచ్చు.
బజాజ్ ప్లాటినా 110 :
ఈ ప్లాటినా బైక్ ధర, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 8.48bhp పవర్, 115cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. 70kmpl మైలేజీని అందిస్తుంది. ఈఎస్ డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,800 నుంచి ప్రారంభమవుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హైవేపై హైస్పీడ్ వెళ్లేటప్పుడు ఇంజన్‌పై భారాన్ని తగ్గిస్తుంది. ఈ బైక్‌లో CBS కూడా ఉంది. బ్రేక్ వేసే సమయంలో కంట్రోలింగ్ కోసం వీల్స్ మధ్య బ్రేకింగ్ పవర్ అందిస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్ :
బడ్జెట్ కస్టమర్లకు టీవీఎస్ స్పోర్ట్ బెస్ట్ బైక్. మైలేజ్ కాకుండా ధర పరంగా కొనొచ్చు. ఈ బైకు ధర రూ. 57,000 (ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తుంది. ఈ లిస్టులో చాలా తక్కువ ధరకు లభించే బైక్ ఇది. 109.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8.08bhp, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందిస్తుంది. వాస్తవ ప్రపంచంలో మైలేజ్ 70–75kmpl మధ్య ఉంటుంది. విద్యార్థులకు, ఫస్ట్ టైమ్ బైక్ నడిపే వారికి బెస్ట్ ఆప్షన్.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ :
ఈ జాబితాలో అత్యంత సరసమైన బైక్‌లలో ఇదొకటి. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బెస్ట్ బైక్ ఇది. వేరియంట్ బట్టి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 59,477 నుంచి రూ. 72,792 వరకు లభిస్తాయి. 97.2cc ఇంజన్‌తో రన్ అవుతుంది. 8.02PS పవర్, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 70kmpl మైలేజీని అందిస్తుంది. దేశమంతటా హీరో వైడ్ సర్వీస్ నెట్‌వర్క్, అడ్వాన్స్ మెయింట్ నెన్స్ సపోర్టు అందిస్తుంది.
హోండా ఎస్పీ 125 :
ఈ హోండా ఎస్పీ 125 ప్రీమియం ఆప్షన్. 123.94cc ఇంజన్‌తో రన్ అవుతుంది. 10.87PS పవర్, 10.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ సుమారు 60–65kmpl ఉంటుంది. STD వేరియంట్ ధర రూ. 85,564 (ఎక్స్-షోరూమ్) ఉంటే.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ హోండా రోడ్‌సింక్ బ్లూటూత్‌తో DLX వేరియంట్ ధర రూ. 93,152కు లభిస్తుంది. మెరుగైన ఇంజన్, బిల్డ్ క్వాలిటీ 3 ఏళ్లు, 42వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది.
