Ather Rizta and 450 X : వావ్.. ఈ ఏథర్ EV స్కూటర్లో స్మార్ట్ వాయిస్ ఫీచర్.. రోడ్లపై గుంతలు కనిపిస్తే అలర్ట్ చేస్తుంది!
Ather Rizta and 450 X : ఏథర్ ఎనర్జీ నుంచి వచ్చిన అనేక రిజ్టా ఫ్యామిలీ స్కూటర్లలో ఈ మోడల్ రెండేళ్లలోనే 3 లక్షల అమ్మకాలను అధిగమించింది. కంపెనీ ఫస్ట్ ఫ్యామిలీ స్కూటర్ కోసం ఇప్పుడు వాయిస్ కమాండ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
Ather Rizta and 450 X ( Image Credit : AI )
- ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా కమాండ్ ఫీచర్
- రోడ్లపై ముందుగానే గుంతల గురించి అలర్ట్స్ పొందొచ్చు
- ఏథర్ స్కూటర్లలో రిజ్టా ఎలక్ట్రిక్ అమ్మకాలు జోరు
Ather Rizta and 450 X : ఏథర్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏథర్ రిజ్టా స్కూటర్ల కోసం సరికొత్త వాయిస్ కమాండ్ ఫీచర్ వచ్చేసింది. ఇకపై రోడ్లపై రైడ్ చేసేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో దూసుకుపోతున్న ఏథర్ ఎనర్జీ కంపెనీ.. ప్రత్యేకించి రిజ్టా 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఈ వాయిస్ కమాండ్ ఫీచర్ అందిస్తోంది.
ఈ ఫీచర్ ఏథర్‌స్టాక్ 7 సాఫ్ట్వేర్ అప్డేట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్ ద్వారా కొన్ని కొత్త సేఫ్టీ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. మీడియా రిపోర్టు ప్రకారం.. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు నావిగేషన్, ఫోన్ కాల్స్ చేయడం, మ్యూజిక్ వినడం, ఇతర సపోర్ట్ చేసే ఫంక్షన్ల కోసం వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. తద్వారా టచ్‌స్క్రీన్‌ను వాడాల్సిన అవసరం ఉండదు.
వాయిస్ అసిస్టెంట్‌తో పాటు ఏథర్‌స్టాక్ 7 సేఫ్టీ సహా అనేక ఫీచర్లను అందిస్తుంది. ఇందులో స్కూటర్ సంబంధించిన కీలక సమాచారం, రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి క్విక్ నోటిఫికేషన్లు అందిస్తుంది. తద్వారా వినియోగదారులు పదేపదే డిస్ప్లేను చూడాల్సిన అవసరం ఉండదు.
రోడ్లపై గుంతలపై హెచ్చరిక :
ఏథర్‌స్టాక్ 7 ఫీచర్లలో ఇదొకటి. రోడ్లపై గుంతలకు సంబంధించి ముందే రైడర్లను అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ IMU సెన్సార్‌తో పనిచేస్తుంది. డాష్‌బోర్డ్ నోటిఫికేషన్లు, వాయిస్ ప్రాంప్ట్‌ల ద్వారా కస్టమర్లకు గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అలర్ట్స్ అందుతాయి.
గత నెలలో, ఏథర్ ఎనర్జీ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ లాంచ్ అయిన రెండు ఏళ్లలోపే 3లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. కంపెనీ ఫస్ట్ ఫ్యామిలీ స్కూటర్ కాగా కంపెనీ అమ్మకాలలో రిజ్టా భారీ వాటాను సాధించింది.
మార్కెట్లో రిజ్టాకు ఫుల్ డిమాండ్ :
గత ఏడాది డిసెంబర్లో రిజ్టా రెండు లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ మరో లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. మార్కెట్లో రిజ్టాకు రోజురోజుకీ ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.
మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి మార్కెట్లలో ఏథర్ ఎనర్జీ విస్తరణలో రిజ్టా కీ రోల్ పోషించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో కంపెనీ మార్కెట్ వాటా సుమారుగా 17.3 శాతానికి పెరిగింది.
సౌత్ ఇండియా మార్కెట్లో లీడర్ షిప్ రేసులో రిజ్టా సత్తా చాటిందని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. రిజ్టాతో పాటు, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 450S, 450X, 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. రిజ్టాలో భారీ సీటు 56 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్కిడ్ కంట్రోల్, థెఫ్ట్ అలర్ట్ టో అలర్ట్ వంటి సేఫ్టీ, కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తుంది.
