LPG New Connection: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా? ఇలా మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు!
కొత్త LPG గ్యాస్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? దగ్గరలోని ఎల్ పీజీ గ్యాస్ ఆఫీసు ఎక్కడైనా ఉందా? అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి.. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.
- Sreehari A
- Updated on- September 7, 2021 / 07:31 PM IST
New Lpg Connection Via Missed Call
New LPG Connection via Missed Call: కొత్త LPG గ్యాస్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? దగ్గరలోని ఎల్ పీజీ గ్యాస్ ఆఫీసు ఎక్కడైనా ఉందా? అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి.. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటి దగ్గరే ఉండి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. మీ ఇంటికే వచ్చి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వెళతారు గ్యాస్ సర్వీసు ప్రొవైడర్లు. కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నించి ఇబ్బందులు పడే వారికోసం ఇండేన్ గ్యాస్ (Indane Gas) మెరుగైన సర్వీసు అందిస్తోంది. కేవలం మీ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇస్తే చాలు అంటోంది.. వెంటనే కొత్త గ్యాస్ కనెక్షన్ తీసేసుకోవచ్చు అంటోంది.
Salary Hike : ఉద్యోగులకు గుడ్ న్యూస్- వచ్చేఏడాది 9.4 శాతం జీతాలు పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ పెట్టింది. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారు 8454955555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే.. కొత్త గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన సిబ్బంది మీ ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తారు. కొత్త కనెక్షన్ మాత్రమే కాదు.. ఈ నెంబర్‌కు రిజిస్టార్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ విధానం మాత్రమే కాదు.. ఇతర పద్ధుతుల్లో కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ ఆయిల్ కంపెనీ. 7588888824 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. 7718955555 నెంబర్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపినా కూడా గ్యాస్ బుక్ అవుతుంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ నుంచి లేదా cx.indianoil.in ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు.
WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?
