×
Ad

Gas Cylinder Prices Hike : హోలీకి ముందే బిగ్ షాక్.. ఒక్కసారిగా పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు, ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gas Cylinder Prices Hike : వంటగ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

Gas Cylinder Prices Hike ( Image Credit : Gemini AI)

  • మార్చి 1 నుంచి వంటగ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి
  • డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు
  • 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు
  • తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఎంతంటే?

Gas Cylinder Prices Hike : హోలీ పండుగకు ముందే వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ప్రతినెలా మాదిరిగానే మార్చి 1వ తేదీన LPG సిలిండర్ ధరలు పెరిగాయి. దేశంలోని అన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచేశాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు రూ. 28 నుంచి రూ. 31 వరకు పెరిగాయి.

కొత్త ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక, ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం పెరగలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. గృహ వినియోగదారులకు మాత్రం బిగ్ రిలిఫ్ అనే చెప్పాలి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కి పెరిగింది.

డొమెస్టిక్ LPG ధరల్లో మార్పు లేదు :
గృహాల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. హైదరాబాద్‌లో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 905.00గా ఉంది. అదేవిధంగా విజయవాడ, గుంటూరులో రూ.877.50గా ఉంటే విశాఖపట్నంలో రూ.861.00, వరంగల్‌లో రూ.924.00గా ఉంది.

న్యూఢిల్లీలో వంటగ్యాస్ ధర రూ.853, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, కోల్ కత్తాలో రూ.879 వద్ద ఉన్నాయి. రవాణా, నిర్వహణ ఛార్జీలు, ప్రాంతాల ఆధారంగా వంటగ్యాస్ ధరలు మారుతుంటాయి. 2025 ఏప్రిల్ 8న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు సవరించగా ఆ తర్వాత నుంచి స్థిరంగానే ఉన్నాయి.

Read Also : SIM Binding Rule : SIM బైండింగ్ కొత్త రూల్.. మార్చి 1 నుంచి ఈ యూజర్లకు వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేయవు, ఏం చేయాలంటే?

రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు భారీ దెబ్బ :
ఢిల్లీతో పాటు, కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజీ సిలిండర్ ధర ఈరోజు నుంచి రూ.1875.50కి పెరిగింది. గతంలో రూ.1844.50గా ఉంది. ముంబైలో ధర రూ.1692.00 నుంచి రూ.1720.50కి, చెన్నైలో రూ.1899.50 నుంచి రూ.1929.00కి పెరిగింది.

చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరల పెంపుతో దేశంలోని అన్ని రెస్టారెంట్, హోటల్, ధాబా ఆపరేటర్లకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పుడు హోలీ పండుగకు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితిలో గ్యాస్ ధర పెరుగుదల కారణంగా, రెస్టారెంట్, హోటల్, ధాబా ఆపరేటర్ల ఖర్చు పెరుగుతుంది. అయితే, సామాన్యులకు పాత ధరలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

ఏటీఎఫ్ ధరలు పెంపు :
విమానాల్లో వాడే ఫ్యూయిల్ ఏటీఎఫ్ (ATF) ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్చి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర ఇప్పుడు 816.91 డాలర్లకి చేరింది. అంతకుముందు రూ. 91,393.39గా ఉన్న 1,000 లీటర్ల ఏటీఎఫ్ ధర రూ. 96,638.14కు పెరుగుతుంది. ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ ధర ముంబైలో 816.62 డాలర్లు (రూ. 90,451.87)కు లభిస్తుంది. అలాగే కోల్‌కతాలో 855.25 డాలర్లు (రూ. 99,587.14), చెన్నైలో 812.32 డాలర్లు (రూ. 1,00,280.49)గా ఉంది.