Delhi: దేశంలోనే అతి ఎక్కువ ఈ-బస్సులను ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు.
- tony bekkal
- Published On : September 6, 2023 / 08:09 PM IST
Lt Governor, Chief Minister, Delhi, e-busese-Buses: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థ TML CV మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (DTC)కి 400 అత్యాధునిక స్టార్‌బస్ EV బస్సులను సరఫరా చేసింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం అంతటా సురక్షితమైన, సౌకర్యవంతమైన, సౌలభ్యవంతమైన ఇంట్రా-సిటీ ప్రయాణాన్ని అందించడానికి ఇవి రూపొందించారు. ఈ విస్తరణతో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఇ-బస్సులను సరఫరా చేసే ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
Kaavaali Video Song : జైలర్ నుంచి ‘కావాలి’ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఒక లుక్ వేసేయండి..
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు. జీరో-ఎమిషన్, సైలెంట్ ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాన్ని స్వాగతిస్తూ DTC మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా షిండే మాట్లాడుతూ, “DTC ఢిల్లీ పౌరులకు సమర్థవంతమైన, ఆర్థిక, విశ్వసనీయమైన రోడ్డు రవాణా సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. ఈ 400 ఎలక్ట్రిక్ బస్సుల జోడింపు జాతీయ రాజధాని భూభాగం అంతటా మాస్ మొబిలిటీని సురక్షితమైందిగా, తెలివైందిగా, కాలుష్యరహితంగా మారుస్తుంది’’ అని అన్నారు.
