Mahindra Bolero Neo Plus : 9-సీటర్ కెపాసిటీతో కొత్త మహీంద్రా బొలెరో నియో ప్లస్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Mahindra Bolero Neo Plus : మహీంద్రా కంపెనీ నుంచి సరికొత్త బొలెరో నియో ప్లస్ కారు వచ్చేసింది. 9-సీటర్ కెపాసిటీ, మహీంద్రా పాపులర్ 2.2-లీటర్ (mHawk) డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అందిస్తుంది.

Mahindra Bolero Neo Plus : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త 9-సీటర్‌ కెపాసిటీతో మహీంద్రా బొలెరో నియో ప్లస్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ రూ. 11.39 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ బొలెరో వాహనం పర్సనల్, కమర్షియల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

మూడవ వరుస సీట్లలో ప్రయాణీకులు వెనుక నుంచి కారు లోపలికి ప్రవేశించవచ్చు. అలానే సులభంగా బయటకు దిగవచ్చు. బ్యాక్-వీల్స్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో బొలెరో నియో ప్లస్ 9-సీటర్ మహీంద్రా పాపులర్ 2.2-లీటర్ (mHawk) డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తుంది.

మహీంద్రా బొలెరో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఎస్‌యూవీ బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. హై రేంజ్ స్టీల్ బాడీ షెల్‌ను కలిగి ఉంది. బొలెరో నియో ప్లస్ 9-సీటర్‌లో ఎక్స్-ఆకారపు బంపర్లు, క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్, సైడ్ బాడీ క్లాడింగ్, ఎక్స్-ఆకారపు స్పేర్ వీల్ కవర్ వంటి సిగ్నేచర్ బొలెరో అంశాలు ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, సైడ్, రియర్ ఫుట్‌స్టెప్స్ ఉన్నాయి. క్యాబిన్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

బొలెరో కారు ఎత్తును అడ్జెస్ట్ చేయగల డ్రైవర్ సీటు, యాంటీ-గ్లేర్ ఐఆర్‌వీఎమ్, ఫ్రంట్, బ్యాక్ పవర్ విండోలు, ఆర్మ్‌రెస్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9-సీట్ల కాన్ఫిగరేషన్ 2-3-4 ప్యాట్రన్ కలిగి ఉంది. బొలెరో నియో ప్లస్ 9-సీటర్‌లో ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐఎస్ఓ‌ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఆటోమేటిక్ డోర్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ వారీగా మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కిందివిధంగా ఉన్నాయి.

  • మహీంద్రా బొలెరో నియో ప్లస్ పీ4 : రూ. 11.39 లక్షలు
  • మహీంద్రా బొలెరో నియో ప్లస్ పీ10 : రూ. 12.49 లక్షలు

Read Also : Vivo T3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌కు వివో T3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం ధర రూ 12,499 మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు