×
Ad

Mahindra XEV 9e : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ EV SUV వచ్చేసింది, సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ పైగా రేంజ్, ధర, బుకింగ్ వివరాలివే

Mahindra XEV 9e Cineluxe Edition : మహీంద్రా నుంచి సరికొత్త EV SUV కారు వచ్చేసింది. మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV XEV 9e ప్రీమియం వెర్షన్‌ సినీలక్స్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Mahindra XEV 9e Cineluxe Edition

  • భారత మార్కెట్లోకి మహీంద్రా నుంచి XEV 9e సినీలక్స్ ఎడిషన్
  • మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV 9e ప్రీమియం వెర్షన్‌
  • కొత్త XEV 9e ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 29.35 లక్షలు
  • మార్చి 10న కారు డెలివరీలు, మార్చి 2న కొత్త ఈవీ బుకింగ్‌లు

Mahindra XEV 9e Cineluxe Edition : కొత్త కారు కొనేవారికి అదిరిపోయే న్యూస్. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి 1న భారత మార్కెట్లో కొత్త ఎక్స్ఈవీ 9e పేరుతో లాంచ్ చేసింది. మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV 9e ప్రీమియం వెర్షన్‌. మహీంద్రా ఈవీ కారు కోసం చూస్తుంటే కొత్త ఎక్స్ఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్‌ కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహీంద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్ ధర :
మహీంద్రా కొత్త ఈవీ, ఎస్‌యూవీ, XEV 9e సినీలక్స్ ఎడిషన్ ధర విషయానికి వస్తే కొత్త XEV 9e ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 29.35 లక్షలు. కొత్త ఈవీ బుకింగ్‌లు మార్చి 2న ప్రారంభమవుతాయి. డెలివరీలు మార్చి 10న ప్రారంభమవుతాయి. కొత్త ఈవీ శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ ఎలక్ట్రిక్ కారు నవంబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో అత్యంత పాపులారిటీ పొందిన ఎలక్ట్రిక్ SUV కార్లలో ఇదొకటి. ఈ మోడల్ ICOTY 2026లో గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. కంపెనీ ప్రకారం, ఈ ఎస్‌యూవీ మోడల్ కారు సెలబ్రిటీలు, అథ్లెట్లు, బిజినెస్ లీడర్లు ఎక్కువ వాడుతుండటంతో బాగా పాపులార్ అయింది.

Read Also : iQOO 15 Discount : వావ్.. ఇది కదా డిస్కౌంట్, 50MP సెల్ఫీ కెమెరాతో ఐక్యూ 15 అతి చౌకైన ధరకే, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

మహీంద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్ డిజైన్, ఫీచర్లు :
కొత్త XEV 9e సినీలక్స్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త ఈవీ ప్రీమియం ఇంటీరియర్‌తో వస్తుంది. ఇందులో చెస్ట్‌నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో స్మూత్-గ్రెయిన్ లెదర్ ఇంటీరియర్‌లు ఉన్నాయి.

కంపెనీ ప్రకారం క్యాబిన్ ప్రైవేట్ లాంజ్ లాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. కొత్త ఈవీలో కోస్ట్-టు-కోస్ట్ ట్రిపుల్ HD డిస్‌ప్లే, 16MP హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, 16 మిలియన్లకు పైగా కలర్ ఆప్షన్‌లతో యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్ బ్యాటరీ, రేంజ్ :
కొత్త మహీంద్రా ఎక్సఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్ టాప్-ఎండ్ ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా రూపొందింది. 79kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది.