Mahindra Thar EMI : మిడిల్ క్లాసు మహీంద్రా థార్.. రూ. లక్ష డౌన్‌పేమెంట్‌ కట్టి ఇంటికి తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?

Mahindra Thar : మహీంద్రా థార్ కొనేవారికి గుడ్ న్యూస్. రూ. లక్ష డౌన్ పేమెంట్ కడితే మహీంద్రా థార్ మీ సొంతం అవుతుంది. నెలవారీ ఈఎంఐ ఎంత చెల్లించాలంటే?

Mahindra Thar

  • సరసమైన ధరకే మహీంద్రా థార్ కొనేసుకోవచ్చు
  • రూ. లక్షడౌన్ పేమెంట్, నెలకు రూ. 16,667 ఈఎంఐ
  • ఈ థార్ కొనాలంటే రూ. 10.36 లక్షల లోన్ అవసరం

Mahindra Thar : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు మహీంద్రా థార్ బడ్జెట్ ధరలోనే వస్తోంది. బేస్ డీజిల్ వేరియంట్ (AXT) ఇప్పుడు రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది. మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్‌ కడితే చాలు..

ఈ పవర్‌ఫుల్ SUV సొంతం చేసుకోవచ్చు. యువతకు డ్రీమ్ కార్‌గా మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఈ మహీంద్రా థార్ స్టైల్, పవర్, రోడ్ ప్రెజెన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీతో ఆకట్టుకుంటోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ థార్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 11.36 లక్షలు. మీరు రూ. లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. దాదాపు రూ. 10.36 లక్షల లోన్ అవసరం. అప్పుడు 9 శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే మీ నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 16,667 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఈఎంఐ కట్టి లగ్జరీ SUV కారును ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట.

Read Also : AC Prices Hike : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఏసీల ధరలు.. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు కొనాలన్నా కొనలేరు..!

మహీంద్రా థార్ ధర ఎంతంటే? :
మహీంద్రా ధార్ మొత్తం ధర విషయానికి వస్తే.. రూ. 10.36 లక్షల లోన్‌పై 7 ఏళ్లకు దాదాపు రూ. 3.64 లక్షల వడ్డీ చెల్లించాలి. రూ. 11.36 లక్షల ఆన్-రోడ్ ధర ఉండగా మొత్తం కలిపి దాదాపు రూ. 15 లక్షలు ఖర్చవుతుంది. అయినా థార్‌ మోడల్ రీసేల్ వాల్యూ, స్ట్రాంగ్ బిల్డ్ వంటి వాటితో అత్యంత ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రస్తుత మార్కెట్లో మహీంద్రా థార్‌కు ఫోర్స్ గూర్ఖా, మారుతి సుజుకి జిమ్నీ వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఉంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం, పవర్, లుక్ విషయంలో థార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
జిమ్నీ సిటీ ట్రాఫిక్‌కు బెస్ట్ అయితే థార్ మాత్రం అడ్వెంచర్, స్టైల్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

మహీంద్రా థార్ :
మహీంద్రా థార్‌లో హై గ్రౌండ్ క్లియరెన్స్, రాబస్ట్ బిల్డ్ క్వాలిటీతో రోడ్లపై ఈజీగా దూసుకెళ్తుంది. ఇతర ఎస్‌యూవీల కన్నా బెటర్ ఆప్షన్. వీకెండ్ ట్రిప్స్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం అద్భుతమైన ఆప్షన్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి కొంచెం భారీగా అనిపించినా ఒకసారి డ్రైవ్ చేస్తే పర్ఫార్మెన్స్ కంఫర్ట్ కచ్చితంగా మీకు నచ్చుతాయి.