Advance Tax : అడ్వాన్స్ టాక్స్ ఇంకా కట్టలేదా? ఈరోజే లాస్ట్ డేట్.. ఆదివారం చెల్లించవచ్చా? ఎవరు కట్టాలి? రూల్స్ తెలుసుకోండి!
Advance Tax: అడ్వాన్స్ టాక్స్ చెల్లించలేదా? మార్చి 15న చివరి తేదీ. ఆదివారం కూడా టాక్స్ పే చేయొచ్చా? అసలు రూల్స్ ఏంటి? లేదంటే ఏమౌతుంది? పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published On : March 15, 2026 / 06:36 PM IST
Advance Tax
- అడ్వాన్స్ టాక్స్ కు మార్చి 15 డెడ్‌లైన్
- ఆదివారం టాక్స్ పేమెంట్లు చేయొచ్చా? లేదా?
- పన్నుచెల్లింపుదారులు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి
Advance Tax : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. అడ్వాన్స్ టాక్స్ పే చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి. ఈరోజే (మార్చి 15) లాస్ట్ డేట్.. ఆదివారం కదా టాక్స్ కట్టాలో లేదో అని ఆలోచిస్తున్నారా?
సాధారణంగా అడ్వాన్స్ టాక్స్ అనేది బిజినెస్ లేదా ఎక్స్‌పర్ట్స్ మాత్రమే కడతారని చాలామంది అనుకుంటారు.
అద్దె ఆదాయం, మూలధన లాభాలు, బ్యాంకు వడ్డీ వంటి మీ జీతం కాకుండా ఇతర మార్గాల్లో నుంచి మీరు సంపాదించే ప్రతి రూపాయిపై టాక్స్ పడొచ్చు. అడ్వాన్స్ టాక్స్ కూడా చెల్లించాల్సి రావచ్చు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ చెల్లించేందుకు మార్చి 15 చివరి తేదీ. టీడీఎస్ కట్ అయిన తర్వాత మీ మొత్తం పన్ను బాధ్యత రూ. 10,000 దాటితే ఆ తర్వాత వడ్డీ ఛార్జీలను నివారించేందుకు మీరు ఈరోజే మీ పన్ను బకాయిలను చెల్లించాలి.
అడ్వాన్స్ టాక్స్ ఎవరు చెల్లించాలి? :
అడ్వాన్స్ టాక్స్ అనేది వ్యాపారాలు లేదా నిపుణులకు మాత్రమేనని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. అద్దె ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ లేదా బ్యాంకు వడ్డీ వంటి జీతం కాకుండా ఇతర వనరుల నుంచి మీకు ఆదాయం ఉంటే దానిపై TDS కట్ కాకపోయినా లేదా తక్కువ కట్ అయినా మీరు అడ్వాన్స్ టాక్స్ కూడా చెల్లించాల్సి రావచ్చు.
మార్చి 15న డెడ్ లైన్ లోగా సంబంధిత పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ‘ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్’ను ఎంచుకునే వారు ఏడాది పొడవునా వాయిదాలలో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మార్చి 15 నాటికి వారి మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఒకేసారి జమ చేయవచ్చు.
Read Also : Railway Parcel App : పార్సల్ పంపడం ఇక ఈజీ.. రైల్వే యాప్‌తో మీ ఇంటి దగ్గర నుంచే.. జస్ట్ బుక్ చేస్తే చాలు!
సీనియర్ సిటిజన్లకు స్పెషల్ డిస్కౌంట్లు :
మీరు సీనియర్ సిటిజన్ అయితే మీకు వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేదంటే మీరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించకుండా పూర్తిగా మినహాయింపు పొందవచ్చు. మీకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) లేదా డివిడెండ్ల నుంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు మధ్య-సంవత్సర పన్ను చెల్లింపులు చేయనక్కర్లేదు. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినప్పుడు మీరు నేరుగా మీ పన్నును చెల్లించవచ్చు.
ఆదివారం కూడా పేమెంట్ చేయొచ్చా? :
ఈరోజు ఆదివారం.. పన్ను చెల్లింపుదారులు టాక్స్ చెల్లించాలా? లేదా అనే సందేహాలు ఉంటాయి. ఆదాయపు పన్ను పోర్టల్ 24/7 పనిచేస్తుంది. ఆదివారం కూడా మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా యూపీఐ ఉపయోగించి మీ ఇంటి నుంచి ఈజీగా ఆన్‌లైన్ పేమెంట్లు చేయవచ్చు. మీరు ఆన్‌లైన్ పేమెంట్లు చేయలేకపోతే మీరు పోర్టల్ నుంచి చలాన్‌ను జనరేట్ చేసుకోవచ్చు.
ఈ చలాన్‌ను బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయవచ్చు. చలాన్ వ్యాలిడిటీ చలాన్ జనరేట్ చేసిన తేదీ నుంచి 15 రోజులు లేదా మార్చి 31 వరకు, ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. పేమెంట్ చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీ పన్ను లెక్కలు కచ్చితమైనవేనని కన్ఫార్మ్ చేసుకోండి. ఓసారి చెక్ చేయండి.
AIS, ఫారం 26AS: మీరు ఎలాంటి ఆదాయాన్ని కోల్పోకుండా ఉండేలా మీ వార్షిక సమాచార ప్రకటన, ఫారం 26ASని తప్పకుండా చెక్ చేయండి.
ఆదాయం లెక్కలు : అద్దె ఆదాయం, ఫ్రీలాన్సింగ్ ఆదాయం, బ్యాంకు వడ్డీని కచ్చితంగా లెక్కించండి.
సరైన చలాన్ : ఆదాయపు పన్ను పోర్టల్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు ‘అసెస్‌మెంట్ ఇయర్’, ‘పేమెంట్ టైప్’ని జాగ్రత్తగా ఎంచుకోండి.
గడువు దాటితే జరిగేది ఇదే :
మీరు ఈరోజు అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే నేరుగా పెనాల్టీ ఉండదు. అయితే, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 234B, 234C కింద వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. మీ మొత్తం పన్ను బాధ్యతను మరింత పెంచుతుంది.
