Maruti Suzuki : మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు శుభవార్త.. మారుతి కార్లు ఇప్పుడు మరింత చవక.. ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్..!
Maruti Suzuki : మే 2026లో మారుతి సుజుకి అనేక కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో మారుతి సుజుకి కారు కొనుగోలుపై రూ. 2.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
- Sreehari A
- Updated on- May 7, 2026 / 01:29 PM IST
Maruti Suzuki Cars
- మేలో మారుతి సుజుకి కార్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు
- ఏకంగా రూ. 2.15 లక్షల వరకు భారీ తగ్గింపు ఆఫర్లు
- క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు
Maruti Suzuki : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఈ మే నెలలో కొత్త కారు కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. మారుతి సుజుకి కారు లవర్స్ అయితే ఇంకా బెటర్. మీకోసం అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మే 2026లో మారుతి సుజుకి అనేక కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
మారుతి సుజుకి కారు (Maruti Suzuki) కొనుగోలుపై రూ. 2.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, డీలర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి బ్రెజ్జా :
ప్రస్తుతం ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి బ్రెజ్జాపై రూ. 55వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేస్తే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. మారుతి సుజుకి బ్రెజ్జా ధరలు రూ. 8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ప్రారంభమవుతాయి.
మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. 103PS పవర్, 139Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. 88PS పవర్, 121Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి విక్టోరిస్ :
ప్రస్తుతం మారుతి సుజుకి ఎస్‌యూవీ నుంచి మారుతి సుజుకి విక్టోరిస్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ విక్టోరిస్‌పై కంపెనీ ప్రస్తుతం రూ. 70వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ మిడ్-సైజ్ SUV ధర రూ. 10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా :
మేలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకుంటే మీరు రోడ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు రూ. 1.85 లక్షల వరకు ఆదా చేయొచ్చు. కంపెనీ రూ. 90వేల వరకు విలువైన అదనపు ఆఫర్లు, ఫ్రీగా 5 ఏళ్లు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా అందిస్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 10.76 లక్షల నుంచి రూ. 19.72 లక్షల మధ్య ఉన్నాయి.
మారుతి సుజుకి ఇన్విక్టో :
ప్రస్తుతం మారుతి సుజుకి ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టోపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఇన్విక్టోపై ప్రస్తుతం రూ. 2.15 లక్షల వరకు మొత్తం తగ్గింపు లభిస్తోంది. మారుతి సుజుకి ఇన్విక్టో ధర రూ. 24.97 లక్షల నుంచి రూ. 28.60 లక్షల మధ్య ఉంటుంది.
