Samsung Galaxy A37 5G : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ గెలాక్సీ A37 5జీపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A37 5G : శాంసంగ్ మిడ్-రేంజ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A37 5జీని మార్చిలో లాంచ్ చేసింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ఎలా కొనాలంటే?

Samsung Galaxy A37 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్. మిడ్-రేంజ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A37 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. గత మార్చిలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ A37 5జీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ అద్భుతమైన అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు.

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ధర తగ్గింపులు బ్యాంక్ ఆఫర్లతో సహా శాంసంగ్ గెలాక్సీ A37 5జీపై ఎక్కువ సేవింగ్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ డీల్స్, ఆఫర్లు ధరల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ధర, ఆఫర్లు : ఈ ఏడాది మార్చిలో రూ. 41,999 ధరకు లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 36,999 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,850 తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 35,149కి తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 6,850 తక్కువకే లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వన్ యూఐ 8.5తో రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ పొడవు 162.9mm, వెడల్పు 78.2mm, మందం 7.4mm, బరువు 196 గ్రాములు ఉంటుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A37 5జీలో ఎఫ్1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, F2.2 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా, F2.4 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, GPS, Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC,USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
