Maruti Suzuki Brezza Facelift : రూ.7 లక్షల రేంజ్‌లో మారుతి బ్రెజ్జా కొత్త అవతార్.. ఈ SUV కొంటే 10 ఏళ్లు నో టెన్షన్..!

Maruti Suzuki Brezza Facelift : 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. కొత్త డిజైన్, అప్‌డేట్ ఫీచర్లు, పలు ఇంజన్ ఆప్షన్‌లతో వచ్చింది. అండర్‌బాడీ CNG ట్యాంక్ బూట్ స్పేస్‌ను పెంచింది.

Maruti Suzuki Brezza Facelift

  • మారుతి బ్రెజ్జా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
  • కొత్త ఫీచర్లతో మారుతి బ్రెజ్జా 2026 మాస్ ఎంట్రీ
  • మారుతి బ్రెజ్జా SUVలో అదిరిపోయే మార్పులు

Maruti Suzuki Brezza Facelift : కొత్త కారు కొంటున్నారా? మీరు మారుతి కారు లవర్స్ అయితే ఇది మీకోసమే.. మారుతి సుజుకి 2026 బ్రెజ్జా వచ్చేసింది. భారత మార్కెట్లోకి జూలై 23న ఈ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కంపెనీ ఈ మోడల్ డిజైన్, ఫీచర్లను అత్యంత ఆకర్షణీయంగా అప్‌గ్రేడ్ చేసింది.

ఈ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కుషాక్ వంటి మోడళ్లకు పోటీగా (Maruti Suzuki Brezza Facelift) మార్కెట్లోకి అడుగుపెట్టింది. పూర్తి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు :
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది.

కలర్ ఆప్షన్లు :
మారుతి సుజుకి బ్రెజ్జా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. సింగిల్-టోన్ కలర్ల విషయానికి వస్తే.. వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే సిజ్లింగ్ రెడ్ ఉన్నాయి.

డ్యూయల్-టోన్ ఆప్షన్లలో సిజ్లింగ్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, లస్ట్రస్ బీజ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్ పెర్ల్ ఆర్కిటిక్ వైట్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. మారుతి సుజుకి విక్టోరియా మాదిరిగానే CNG ట్యాంక్‌ను ఇప్పుడు బాడీ కింద అమర్చారు. తద్వారా కస్టమర్లకు బూట్ స్పేస్ మరింత పెరిగింది.

బ్రేకులు, సస్పెన్షన్, టైర్లు :

బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ సైడ్ మాక్‌ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేకులు, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 215/60 R16 టైర్లపై నడుస్తుంది.

Read Also : EPFO Interest Credit : PF ఖాతాదారులకు అలర్ట్.. మీ EPF ఖాతాలో వడ్డీ పడిందా? 2 నిమిషాల్లోనే ఇలా చెక్ చేసుకోండి!

ఇంజిన్ ఆప్షన్లు :
1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ మాన్యువల్ వేరియంట్, LXi/VXi వేరియంట్‌కు 21.09 కి.మీ/లీ, ZXi/ZXi+ వేరియంట్‌కు 20.81 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ZXi/ZXi+ వేరియంట్‌లకు 20.17 కి.మీ/లీ, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 20.81 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ S-CNG మాన్యువల్ వేరియంట్ 26.90 కి.మీ/కి.మీ మైలేజీని అందిస్తుంది.

సీఎన్‌జీ స్పెసిఫికేషన్లు :
మారుతి బ్రెజ్జా CNG వేరియంట్ కూడా అదే 1.5-లీటర్ K15C ఇంజన్‌తో రన్ అవుతుంది. పెట్రోల్, సీఎన్‌జీ రెండు మోడ్‌లలోనూ నడుస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 103.06PS పవర్, 136Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా, సీఎన్‌జీ మోడ్‌లో 4,200rpm వద్ద 121.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ ట్యాంక్ సామర్థ్యం 55 లీటర్ల నీటికి సమానంగా ఉంటుంది.

ఎన్ఏ ఇంజిన్ స్పెసిఫికేషన్లు :

1,462cc డిస్ప్లేస్‌మెంట్ 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 6,000rpm వద్ద 75.8kW (103.06PS) పవర్, 4,400rpm వద్ద 139Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 48-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది.

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా 3995 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1685 మిమీ ఎత్తు ఉంటుంది. వీల్‌బేస్ 2500mmగా ఉంది. ఈ ఎస్‌యూవీలో ఐదుగురు వ్యక్తులు కూర్చోగలిగేలా ఫైవ్-సీట్ క్యాబిన్ లేఅవుట్ ఉంది. 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.

డ్యూయల్-టోన్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ప్రీమియం క్యాబిన్ థీమ్‌ ఉంది. క్రోమ్-ప్లేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఫ్యాబ్రిక్-ఫినిష్డ్ డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు, లగేజ్ ల్యాంప్‌లు, గ్లోవ్ బాక్స్ ఇల్యూమినేషన్, ఫ్రంట్ ఫుట్‌వెల్ ఇల్యూమినేషన్, క్యాబిన్ ల్యాంప్‌ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో పియానో ​​బ్లాక్ ఫినిష్ ఎలిమెంట్స్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఐఆర్‌విఎం (IRVM) ఉన్నాయి.

ధర ఎంతంటే? :
2026 మారుతి సుజుకి బ్రెజ్జా ధర రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ ధర లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. తర్వాత రోజుల్లో ధర పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.