Suzuki Swift Hydrogen : పెట్రోల్ కాదు, ఈవీ కాదు.. ఇకపై హైడ్రోజన్ కార్లు! మారుతి స్విఫ్ట్ కొత్త ఫ్యూచర్ టెక్నాలజీ ఇదే!

Suzuki Swift Hydrogen : మారుతి సుజుకి కొత్త హైడ్రోజన్ DI టెక్నాలజీతో స్విఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్‌తో కాకుండా, హైడ్రోజన్ ఇంజిన్‌తో నడుస్తుంది. పూర్తి వివరాలివే..

Suzuki Swift Hydrogen

Suzuki Swift Hydrogen : మారుతి కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. మారుతి నుంచి హైడ్రోజన్ కారు వస్తోంది. మారుతి సుజుకి స్విఫ్ట్ చాలా కాలంగా భారత్, ప్రపంచ మార్కెట్లో అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి.

ఇప్పుడు కంపెనీ పెట్రోల్, డీజిల్, టర్బో-పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్, CNGతో సహా వివిధ రకాల ఇంజన్ ఆప్షన్‌లలో అందించింది. ఇప్పుడు, కంపెనీ స్విఫ్ట్‌కు కొత్త స్పెషల్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్విఫ్ట్ పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్‌తో కాకుండా హైడ్రోజన్ టెక్నాలజీతో నడుస్తుంది.

కొత్త హైడ్రోజన్ DI టెక్నాలజీ ఏంటి? :
సుజుకి మోటార్ కార్పొరేషన్, మొబిలిటీ టెక్నాలజీ కంపెనీ ఏవీఎల్‌తో కలిసి కొత్త హైడ్రోజన్ డీఐ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని 2026 వియన్నా మోటార్ సింపోజియంలో ప్రదర్శించారు.

ఈ టెక్నాలజీని ప్రదర్శించేందుకు కంపెనీ స్విఫ్ట్ ప్రోటోటైప్ మోడల్‌ను వాడింది. ఇప్పటి వరకు, చాలా హైడ్రోజన్ వెహికల్స్, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించాయి.

Read Also : Vivo X300 Pro : వివో ఫ్యాన్స్ మీకోసమే.. ఈ వివో X300 ప్రోపై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఎందుకు కొనాలంటే?

ఇందులో హైడ్రోజన్‌ను పవర్‌గా మార్చి ఆపై మోటార్ ద్వారా కారు రన్ అవుతుంది. అయితే, ఈ కొత్త టెక్నాలజీలో హైడ్రోజన్‌ను నేరుగా ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఇంజిన్‌కు మరింత పవర్, మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఇంజన్ పవర్, టార్క్‌ :
ఈ సిస్టమ్ సుజుకి 1.4-లీటర్, 4-సిలిండర్ హైడ్రోజన్ ఇంజిన్ ఆధారంగా రూపొందింది. ప్రత్యేకంగా, ఈ ఇంజిన్ ‘లీన్ మోడ్’, ‘లాంబ్డా=1’ అనే రెండు మోడ్‌లలోనూ పనిచేస్తుంది.

ఇంజిన్ సామర్థ్యంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కొత్త టెక్నాలజీ సుమారుగా 10kW ఎక్కువ పవర్, 20Nm ఎక్కువ టార్క్ అందిస్తుంది. మొత్తం అవుట్‌పుట్‌ను 100kW, 220Nmకు చేర్చుతుంది.

పర్యావరణానికి అద్భుతమైన ఆప్షన్ :
హైడ్రోజన్ టెక్నాలజీ అనేది పర్యావరణానికి చాలా ప్రయోజనరంగా మారనుంది. ఈ టెక్నాలజీ కార్బన్ ఉద్గారాలు, కాలుష్యాన్ని భారీగా తగ్గిస్తుంది.
ప్రస్తుతం, భారత్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. కానీ, భవిష్యత్తులో హైడ్రోజన్ టెక్నాలజీ కూడా ఆటో రంగంలో భారీ మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది.