Infinix Note 40X 5G : వావ్.. స్పెషల్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఇన్ఫినిక్స్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనే కొనేసుకోవచ్చు!

Infinix Note 40X 5G : కొత్త ఫోన్ కావాలా? ఇన్ఫినిక్స్ నోట్ 40x 5G ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది.

Infinix Note 40X 5G

Infinix Note 40X 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అత్యున్నత స్థాయి ఫీచర్లతో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో
ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Read Also : PM Awas Yojana Scheme : కేంద్రం కొత్త ఇల్లు ఇస్తోంది.. ‘పీఎం ఆవాస్ యోజన’ గడువు పెంచారు.. త్వరగా అప్లయ్ చేసుకోండి..!

కొనుగోలుదారులకు ఇదే బెస్ట్ ఆఫర్‌ అని చెప్పవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, హై-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకు అద్భుతమైన వాల్యూను అందిస్తుంది. మీరు మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. లేటెస్ట్ ఆఫర్లను ఓసారి చెక్ చేయండి.

ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G డిస్‌ప్లే :
ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ఫోన్ 1080 x 2406 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సున్నితమైన స్క్రోలింగ్, మెరుగైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. పంచ్-హోల్ డిజైన్, వీడియోలు, గేమ్‌ల కోసం వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ప్రాసెసర్ :
ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 2.4GHz క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను అందిస్తుంది. లాగ్-ఫ్రీ‌ని అందిస్తుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో యూజర్లు యాప్‌లు, మీడియా, ఫైల్స్ కోసం తగినంత స్టోరేజీని అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G కెమెరా :
ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, f/1.8 వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. అంతేకాదు.. 2MP ఏఐ లెన్స్ కూడా ఉంది. డెప్త్, క్లారిటీని పెంచుతుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా క్లియర్ ఫొటోలను తీయొచ్చు. వీడియో కాల్స్, సోషల్ మీడియా స్ర్కోలింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది.

బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
5000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ రోజంతా ఛార్జింగ్ వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వేగంగా ఛార్జింగ్ అవుతుంది. ఇతర ఫీచర్లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, NFC, IR బ్లాస్టర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ v15పై రన్ అవుతుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు స్టోరేజీని విస్తరించవచ్చు.

ధర, వేరియంట్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ఫోన్ 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ. 12,999కు అందిస్తోంది. బడ్జెట్ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర ₹13,995కు పొందవచ్చు. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో అత్యల్ప ధరకు ఈ 5జీ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gపై ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ :
ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు వారి కొనుగోలుపై రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ :
కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి లావాదేవీలపై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Airtel OTT Plans : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో ఫ్రీగా OTT సబ్‌‌స్ర్కిప్షన్.. హైస్పీడ్ డేటా.. ఐపీఎల్ కూడా చూడొచ్చు!

స్పెషల్ ధర ఆఫర్ :
ధరతో కూడిన క్యాష్‌బ్యాక్/కూపన్ ఆఫర్‌లో భాగంగా అదనంగా రూ. 2వేలు తగ్గింపు అందుబాటులో ఉంది.

నో-కాస్ట్ EMI :
కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ. 458కు నో-కాస్ట్ EMI ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.

Note : లేటెస్ట్ గాడ్జెట్ ఆఫర్‌లను చెక్ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ విజిట్ చేయండి. ఎందుకంటే.. మొబైల్ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు మారుతుంటాయి.