PM Awas Yojana Scheme : కేంద్రం కొత్త ఇల్లు ఇస్తోంది.. ‘పీఎం ఆవాస్ యోజన’ గడువు పెంచారు.. త్వరగా అప్లయ్ చేసుకోండి..!

PM Awas Yojana Scheme : పీఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ గడువు తేదీని ఏప్రిల్ 30 వరకు పెంచింది.

PM Awas Yojana Scheme : కేంద్రం కొత్త ఇల్లు ఇస్తోంది.. ‘పీఎం ఆవాస్ యోజన’ గడువు పెంచారు.. త్వరగా అప్లయ్ చేసుకోండి..!

PM Awas Yojana Scheme

Updated On : April 3, 2025 / 9:42 PM IST

PM Awas Yojana Scheme : కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా? మీ ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే. ఈ పథకం ప్రయోజనాలను మరింత మందికి అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియకు గడువు తేదీని పొడిగించింది.

ఇప్పుడు అర్హత కలిగిన కుటుంబాలు ఏప్రిల్ 30 వరకు ఆవాస్ ప్లస్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విషయంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధిత అధికారులకు ఒక లేఖ జారీ చేసింది. ముందుగా దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31 ఉండగా, ఇప్పుడు ఆ గడువును మరో నెల పాటు పొడిగించింది.

Read Also : PPF Nominees Update : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై PPF అకౌంట్లలో నామినీలను అప్‌డేట్ చేస్తే.. ఎలాంటి ఛార్జీలు ఉండవు.. ఫుల్ డిటెయిల్స్..!

గ్రామ కార్యదర్శులు ఏం చేస్తారంటే? :
2017-18 సంవత్సరంలో ఏదైనా కారణం చేత దరఖాస్తు చేసుకోలేని కుటుంబాలు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన కుటుంబం నుంచి ఎవరైనా ఆవాస్ ప్లస్ పోర్టల్ ద్వారా తమ స్థాయిలో దరఖాస్తును సమర్పించవచ్చు.

అలాగే, ఈ పథకం కోసం వ్యక్తులను రిజిస్టర్ చేసుకోవడం పంచాయతీల గ్రామ కార్యదర్శుల విధి కూడా. అర్హత కలిగిన కుటుంబం ఈ పథకానికి ఏ విధంగానైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో, ఈ నమోదిత కుటుంబాలకు పక్కా ఇళ్ళు అందించడానికి ప్రభుత్వం బ్లాక్ ప్రకారం లక్ష్యాన్ని ఇస్తుంది.

మీకు ఇంత డబ్బు వస్తుందంటే? :
ఝజ్జర్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ కెప్టెన్ బిర్ధానా ప్రకారం.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, సర్వేను ఒక నెల పాటు పొడిగించినట్లు తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు 3 విడతలుగా ఆర్థిక సాయం అందిస్తారు.

మూడు విడతలుగా ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.1.38 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. మొదటి విడతలో రూ.45 వేలు, రెండవ విడతలో రూ.60, మూడవ, చివరి విడతలో రూ.33 వేలు విడుదల చేస్తారు. అలాగే, (MNREGA) కింద రోజుకు రూ.374 చొప్పున 90 రోజులకు రూ.33,360 వేతనంగా, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12 వేలు ఇస్తారు.

మీ ఇంటి నుంచే అప్లయ్ చేయొచ్చు :
గ్రామ కార్యదర్శి.. అర్హులైన కుటుంబాల ఇళ్లను సందర్శించి సర్వే నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. ఒక గ్రామస్థుడు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఆవాస్ ప్లస్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం సంబంధిత గ్రామ కార్యదర్శిని సంప్రదించవచ్చు.

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు :

  •  దరఖాస్తుదారు, కుటుంబ సభ్యుల ఆధార్ డిటైల్స్
  • దరఖాస్తుదారు బ్యాంక్ అకౌంట్
  • బ్యాంకు అకౌంట్ ఆధార్‌ లింక్ అయి ఉండాలి
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • కుల ధృవీకరణ పత్రం
  • ల్యాండ్ డాక్యుమెంట్ ( సొంత భూమిలో ఇల్లు నిర్మాణం కోసం)

PMAY (అర్బన్) 2.0 దరఖాస్తు చేయాలంటే? :

Read Also : Jio OTT Plans : పండగ చేస్కోండి.. 12 OTT జియో రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్ని చూడొచ్చు!

  • పీఎం ఆవాస్ యోజన 2.0 దరఖాస్తుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://pmay-urban.gov.in/)కి వెళ్లండి.
  • “Apply For PmAY-U 2.0” ఐకాన్‌పై క్లిక్ చేయండి.
  • ఈ స్కీమ్ అందించే సూచనలను జాగ్రత్తగా చదవండి.
  • మీ వార్షిక ఆదాయంతో సహా పూర్తి వివరాలను సమర్పించండి.
  • మీ అర్హతను చెక్ చేయండి.
  • వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేయండి.
  • వెరిఫై తర్వాత, అడ్రస్, ఆదాయ రుజువు వివరాలతో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపండి.
  • ఫారమ్‌ను సమర్పించి మీ అప్లికేషన్ స్టేటస్ కోసం వెయిట్ చేయండి.