Jio OTT Plans : పండగ చేస్కోండి.. 12 OTT జియో రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్ని చూడొచ్చు!
Jio OTT Plans : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన జియో ప్లాన్లపై ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు.

Reliance Jio
Jio OTT Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్ రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుతం రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వారికి అద్భుతమైన ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. ప్రముఖ OTT సర్వీసులకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. జియో అందించే అన్ని OTT ప్లాన్‌ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
రిలయన్స్ జియో భారతీయ టెలికాం మార్కెట్లో అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రీఛార్జ్ చేసే వారికి OTT సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. దాదాపు 12 రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సర్వీసులను యాక్సస్ చేయాలంటే ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
ఫ్రీ JioTV ప్రీమియం ప్లాన్లు :
కంపెనీ రూ.445 ప్లాన్ డజను OTT సర్వీసుల నుంచి కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతిస్తుంది. ఇందులో SonyLIV, ZEE5, Lionsgate Play మొదలైనవి ఉన్నాయి. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీతో వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. దాంతో పాటు, రూ.175 రెండో డేటా ఓన్లీ ప్లాన్ 10 OTT సర్వీసుల నుంచి కంటెంట్‌ను కూడా అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 10GB అదనపు డేటాను అందిస్తుంది.
ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు :
రూ. 1,799, రూ. 1,299 ప్లాన్లతో 84 రోజుల పాటు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. రెండు ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రోజుకు 100 SMS పంపడంతో పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ అందిస్తాయి. అయితే, రూ.1,799 ప్లాన్ రోజువారీ 3GB డేటాను రూ.1,299 ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.
ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ :
జియో ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ ధర రూ.1,029. రీఛార్జ్ చేయడం వల్ల మీకు 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 84 రోజుల పాటు OTT సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదే వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్‌లు :
జియో కంపెనీ 3 ప్లాన్లలో 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ.949 ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉన్నాయి. రూ.100, రూ.195 ప్లాన్‌లలో డేటా మాత్రమే ఉంటుంది. వరుసగా 5GB, 15GB అదనపు డేటాను 90 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు.
ఫ్రీ ఫ్యాన్‌కోడ్ ప్లాన్ :
మీకు ఇష్టమైన స్పోర్ట్స్ కంటెంట్‌ను చూడాలనుకుంటే.. మీరు రూ.3,999 వార్షిక ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 365 రోజుల పాటు 2.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS అందిస్తుంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయవచ్చు.
ఫ్రీ జియోసావన్ ప్రో ప్లాన్‌లు :
మీరు మ్యూజిక్ వినడానికి ఇష్టపడితే.. యాడ్స్ లేకుండా వినాలనుకుంటే మీరు రూ.889 లేదా రూ.329 ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. వరుసగా 84 రోజులు, 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రెండూ 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS అందిస్తాయి.
ఉచిత ZEE5-SonyLIV కాంబో ప్లాన్ :
రూ. 1,049 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. జియో సబ్‌స్క్రైబర్‌లు ZEE5, SonyLIV రెండింటి నుంచి కంటెంట్‌ను 84 రోజుల పాటు యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 84 రోజుల పాటు అన్ లిమవాయిస్ కాలింగ్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది.