Nissan Magnite Car : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ నిస్సాన్ కారుపై ఏకంగా రూ.65 వేలు డిస్కౌంట్.. గోల్డ్ కాయిన్ ఫ్రీ.. డోంట్ మిస్..!
Nissan Magnite Car : నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలుదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. ఏప్రిల్ 15 వరకు రూ. 65వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, ఫ్యూర్ గోల్డ్ కాయిన్ పొందవచ్చు.

Nissan Magnite Car
Nissan Magnite Car : కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) క్రేజీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ డిస్కౌంట్ ధరకే కొత్త కారును అందిస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అద్భుతమైన డిస్కౌంట్ అసలు మిస్ చేసుకోవద్దు.
నిస్సాన్ SUV మాగ్నైట్‌పై ‘హ్యాట్రిక్ కార్నివాల్’ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద నిస్సాన్ మాగ్నైట్ 3 వేర్వేరు బెనిఫిట్స్ కస్టమర్లకు అందిస్తోంది. అందులో మొదటగా తయారీదారు రూ. 55వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
ఈ బెనిఫిట్స్‌తో పాటు నిస్సాన్ రూ. 10వేల వరకు ‘కార్నివాల్ బెనిఫిట్స్’ కూడా అందిస్తోంది. మూడో ఆఫర్‌లో అత్యంత ఆకర్షణీయమైన బెనిఫిట్స్ ఏమిటంటే.. ఈ ఆఫర్ కింద బ్రాండ్ తన కస్టమర్లందరికి ఒక ప్యూర్ గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా అందిస్తోంది.
నిస్సాన్ మాగ్నైట్ కారు ప్రారంభ ధర కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) అందుబాటులో ఉంది. అయితే, కార్నివాల్ బెనిఫిట్స్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. ఈ ఆఫర్‌కు లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ కారును కొనుగోలు చేసే ముందు ఆఫర్ గురించి పూర్తి వివరాల కోసం నిర్దిష్ట డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.
ఈ జపనీస్ కార్ల తయారీదారు ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెండుసార్లు మాగ్నైట్ కార్ల ధరలను పెంచింది. ఈ SUV కారు ధర ఇప్పుడు రూ. 6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కార్ల తయారీదారు మార్చి 2025లో మొత్తం మాగ్నైట్ రేంజ్ E20-కంపాటబుల్ పవర్‌ట్రెయిన్‌తో అప్‌డేట్ చేసింది. SUV 1.0-లీటర్ BR10 పెట్రోల్ ఇంజిన్ E20 కంప్లైంట్‌గా మారింది. అయితే, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారు కొంతకాలం క్రితమే E20 కంప్లైంట్‌గా మార్చేసింది.
నిస్సాన్ మాగ్నైట్ ఇంజిన్, పర్ఫార్మెన్స్ :
నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ మోటార్ 71bhp గరిష్ట శక్తిని, 96Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ 98bhp గరిష్ట శక్తిని, 160Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో సహా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పొందుతుంది. మరోవైపు, టర్బోచార్జ్డ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT)తో వస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ హైబ్రిడ్ మోడల్ :
ఆసక్తికరంగా.. మాగ్నైట్ ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్లతో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో కొత్త హైబ్రిడ్ మోడల్ కార్డుల్లోకి రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. కంపెనీ త్వరలో మాగ్నైట్ హైబ్రిడ్, CNG వేరియంట్లను లాంచ్ చేయవచ్చు. హైబ్రిడ్, CNG వంటి విభిన్న పవర్‌ట్రెయిన్‌లను లైనప్‌కు చేర్చేందుకు కంపెనీ పరిశీలిస్తోంది. కంపెనీ ఇప్పటికే FY26 ముగిసేలోపు EV రంగంలోకి ప్రవేశించే ప్లాన్ ప్రకటించింది.