Apple iPhone 13 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.17వేలకే కొత్త ఐఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 13 : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ధరలోనే ఐఫోన్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా తోపు లాంటి ఫీచర్లతో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Apple iPhone 13 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.17వేలకే కొత్త ఐఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 13 Available

Updated On : April 3, 2025 / 5:01 PM IST

Apple iPhone 13 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఐఫోన్‌.. ఎందుకంటే.. ఐఫోన్ క్రేజే అలా ఉంటుంది మరి. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ కొనాలనే ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ, ఐఫోన్ కోసం అన్ని డబ్బులు పోసి కొనలేరు.

అదే ఆండ్రాయిడ్ ఫోన్ తక్కువ ధరలోనే వస్తుంది కదా అని సరిపెట్టుకుంటారు. కానీ, ఐఫోన్ కాస్ట్ మాత్రమే కాదు.. డిజైన్, ప్రైవసీ పరంగా అనేక సెక్యూరిటీ ఫీచర్లతో ఉంటాయి. నేటికీ, అనేక ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌లు ఖరీదైనవిగానే ఉన్నాయి. అందుకే చాలా మంది డిస్కౌంట్ కోసం ఆసక్తిగా చూస్తుంటారు.

Read Also : HMD Phones : కొత్త HMD 2G ఫోన్లు భలే ఉన్నాయి.. స్మార్ట్‌ఫోన్లే కాదు.. ఈ ఫీచర్ ఫోన్లు కూడా కొనండి.. ధర రూ.1,800 నుంచి..!

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ కొనే బదులు అదే ధరలో ఐఫోన్ కొనేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్లు బ్రాండ్ తగ్గట్టే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ, ప్రస్తుతం మీరు కేవలం రూ. 17వేలకు ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మీకు నమ్మశక్యంగా లేదా? ఈ ఐఫోన్ ఆఫర్ చూస్తే.. ఆండ్రాయిడ్ ఫోన్ కొనడం మానేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వివిధ ఐఫోన్ మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు తమ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17వేలకే :
అతి తక్కువ ధరకు ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. బడ్జెట్ తక్కువగా ఉన్నవారు ఐఫోన్ 14, 15 లేదా 16 సిరీస్‌లు కొనడం కష్టమే. ఆండ్రాయిడ్ ఫోన్ కొనేందుకు ఆలోచిస్తుంటారు. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు.

ఈ ఐఫోన్ పాతదే అయినా పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ, సెక్యూరిటీ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఈ ఐఫోన్ చాలా బెస్ట్ కూడా. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13ని కేవలం రూ.17వేలకే ఆఫర్ చేస్తోంది.

ఐఫోన్ 13 డిస్కౌంట్ :
2021లో లాంచ్ అయిన ఐఫోన్ 13 ఆపిల్ నిలిపివేసింది. కానీ, ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ 13 అందుబాటులో ఉంది. 128GB వేరియంట్ రూ. 49,900 ధరకు అందుబాటులో ఉంది. 9 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో మీరు రూ. 4,901 సేవ్ చేసుకోవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ 13 ధర రూ. 44,999కి తగ్గుతుంది.

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. దాంతో డబ్బులు మరింత ఆదా చేసుకోవచ్చు. బడ్జెట్ తక్కువగా ఉంటే.. EMIలో కొనుగోలు చేయొచ్చు. నెలవారీ పేమెంట్లతో కేవలం రూ. 1,583 నుంచి ఐఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు.

ఇప్పుడు, ఐఫోన్ 13 కేవలం రూ. 30వేలకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,500 వరకు ట్రేడ్ ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

మీరు రూ. 15వేల ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందితే.. ఐఫోన్ 13 కేవలం రూ. 29,999కు ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 13 ధరను మరింత తగ్గవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఆపిల్ ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు :
IP68 రేటింగ్‌తో అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌ కలిగి ఉంది. డాల్బీ విజన్‌కు సపోర్టు ఇచ్చే 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే కూడా అమర్చారు. అదనపు డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం సిరామిక్ షీల్డ్ గ్లాస్‌ కూడా ఉంది. iOS 15లో రన్ అవుతుంది. రాబోయే కొత్త వెర్షన్ అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు.

Read Also : Lava Bold 5G : తగ్గేదేలే.. దిమ్మతిరిగే ఫీచర్లతో స్వదేశీ లావా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. చైనా ఫోన్లు జుజుబీ.. ధర కూడా చాలా తక్కువే..!

ఆపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఐఫోన్ 13 మోడల్ 4GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లు కలిగి ఉంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 12+12MP సెన్సార్లతో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.