SIP Investment Plan : మీకు ఈ నెల జీతం పడిందా? SIPలో ఇలా పెట్టుబడి పెడితే చాలు.. 20 ఏళ్లలో రూ. కోటి సంపాదించవచ్చు..!
SIP Investment Plan : జీతం పడగానే డబ్బులు ఖర్చులుపోనూ మిగిలిన డబ్బులు ఏం చేయాలో తెలియడం లేదా? అయితే ఇప్పుడే SIPలో పెట్టుబడి పెట్టండి. మీకు 20ఏళ్లలో రూ. కోటి సంపాదించుకోవచ్చు.

SIP Investment Plan
SIP Investment Plan : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, ఆ డబ్బులను వెంటనే పెట్టుబడివైపు మళ్లించండి. ఎందుకంటే.. ప్రతినెలా జీతం డబ్బులు ఏదో రూపంలో ఖర్చువుతూనే ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా ఖర్చులు తగ్గించుకుని ఆ డబ్బులను ఏదైనా మంచి ఇన్వెస్ట్ మెంట్ కోసం పెట్టారంటే భవిష్యత్తులో మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. చిన్నమొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులను కూడబెట్టవచ్చు.
ఇంతకీ ఎందులో పెట్టుబడి పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? మీకోసం మ్యూచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అద్భుతమైన ఆప్షన్. మ్యూచువల్ ఫండ్ SIPలో దీర్ఘకాలం పాటు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్లు సంపాదించవచ్చు.
మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది రెగ్యులర్ SIP, రెండవది స్టెప్-అప్ SIP. 20 ఏళ్లలో రూ. 1 కోటి వరకు డబ్బులను సంపాదించాలంటే రెండు పద్ధతుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా పెట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రెగ్యులర్ SIPతో రూ. 1 కోటి వరకు :
రెగ్యులర్ SIPలో ప్రతి నెలా SIPలో స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. మీరు 20 ఏళ్లలో రూ. 1 కోటి వరకు డబ్బులను సంపాదించుకోవచ్చు. మీరు 20 ఏళ్ల పాటు నిరంతరం SIPలో ప్రతి నెలా రూ. 11వేలు పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీరు 20 ఏళ్లలో మొత్తం రూ. 26,40,000 పెట్టుబడి పెడతారు. 12 శాతం రాబడి రేటుతో మొత్తంగా రూ. 74,78,431 వడ్డీ మాత్రమే వస్తుంది. 20 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ. 1,01,18,431 డబ్బు వస్తుంది.
కోటి సంపాదన కోసం SIP ఇలా పెంచండి :
స్టెప్-అప్ SIP.. టాప్-అప్ SIP అని పిలుస్తారు. ఈ విధానంలో మీ నెలవారీ SIP వార్షిక ప్రాతిపదికన 10శాతం పెంచుకుంటూ పోవాలి. ప్రతి నెలా రూ. 5వేలు SIPతో ప్రారంభిస్తే.. ప్రతి సంవత్సరం 10 శాతం పెంచాల్సి ఉంటుంది. 5వేలలో 10 శాతం అంటే.. రూ. 500 అనమాట. అప్పుడు మీకు వచ్చే ఏడాది SIPలో ప్రతి నెలా రూ. 5500 పెట్టుబడి పెట్టాలి. మీరు సరైన దీర్ఘకాలిక పెట్టుబడితో స్టెప్-అప్ SIP ద్వారా రూ.1 కోటి వరకు సంపాదించుకోవచ్చు.
ముందుగా మీరు నెలకు రూ.5,500 SIPతో పెట్టుబడి మొదలుపెట్టాలి. వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా మీరు 20 ఏళ్లలో రూ. 37,80,150 పెట్టుబడి పెడతారు. అందులో మీకు వడ్డీగా రూ. 64,67,111 వస్తుంది అనమాట. 20 ఏళ్ల తర్వాత మీకు రూ. 1,02,47,261 కోట్ల రూపాయలు మీ చేతికి అందుతాయి.