PM Kisan 20th installment : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడో తెలుసా? ఈ రైతులకు రూ.2 వేలు పడవు.. ఎందుకంటే?
PM Kisan 20th installment : పీఎం కిసాన్ 20వ విడత కోసం చూస్తు్న్నారా? మొదటి విడత అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ, మొదటి విడత రూ. 2వేలు పడాలంటే రైతులు తప్పక అర్హత కలిగి ఉండాలి.

PM Kisan 20th installment
PM Kisan 20th installment : లక్షలాది మంది భారతీయ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి-కిసాన్ స్కీమ్ 20వ విడతపై ఉత్కంఠ నెలకొంది. ప్రతి గ్రామంలోనూ రైతులు పీఎం కిసాన్ డబ్బుల గురించి జోరుగా చర్చ సాగుతోంది. 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 22వేల కోట్లు జమ అయ్యాయి.
ముఖ్యంగా ఏమిటంటే.. 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఈ పథకం నుంచి నేరుగా ప్రయోజనం పొందారు. అయితే, పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందా? అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతానికి పీఎం కిసాన్ 20వ విడత గురించి కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రకటన చేయలేదు. కానీ, నివేదికల ప్రకారం.. 20వ విడత జూన్ 2025లో పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇంతకీ, ఏయే రైతులకు మొదటి విడత రూ. 2వేలు పడతాయి? ఎవరికి పడవు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రతి విడతకు ఎంత ఇస్తారంటే.. :
ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చెల్లిస్తుంది. మొత్తం సంవత్సరానికి 3 చెల్లింపులు ఉంటాయి. రైతులు ప్రతి ఏటా రూ. 6వేలు అందుకుంటారు. సులభమైన దరఖాస్తు ప్రక్రియతో పాటు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేస్తుంది.
పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే? :
20వ విడత జూన్ 2025లో వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. రైతులు పోర్టల్‌లో వారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి సరైన వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
- మొదటి విడత : ఏప్రిల్ – జూలై
- 2వ విడత : ఆగస్టు – నవంబర్
- 3వ విడత : డిసెంబర్ – మార్చి
ఈ పథకానికి ఎవరు అర్హులు? :
అర్హత పొందాలంటే.. ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. వారి పేరు మీద వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. భర్త లేదా భార్య, మైనర్ పిల్లలు సహా కుటుంబాలను ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు.
ఈ పథకంలో ఎవరికి మినహాయింపు? :
ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు, 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు.
పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం అనేది అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6వేలు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపిణీ చేస్తారు.
పీఎం కిసాన్ యోజనకు ఎవరు అర్హులు? :
సాగు భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి ఎవరు అర్హులు కాదు? :
- సంస్థాగత భూమి యజమానులు
- ప్రభుత్వ ఉద్యోగులు (రైతులు కాకపోతే)
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు
- వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి నిపుణులు
- రూ. 10వేల కన్నా ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
రైతులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్ (https://pmkisan.gov.in) ద్వారా సమర్పించవచ్చు. లేదంటే మీకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయొచ్చు.
దరఖాస్తుకు ఏ డాక్యుమెంట్లు అవసరం?
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్‌బుక్
- ల్యాండ్ రికార్డ్
- మొబైల్ నంబర్
అకౌంట్ డబ్బులు పడ్డాయో లేదో ఎలా చూడాలి? :
- PM-KISAN పోర్టల్‌ను విజిట్ చేయండి.
- “Beneficiary Status” సెక్షన్‌లో మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ పడకపోతే మీరు అర్హులు కాదని గమనించాలి.
Read Also : Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 15వరకు జియోహాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు.. ఇప్పుడే ఇలా చేయండి!