Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 15వరకు జియోహాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు.. ఇప్పుడే ఇలా చేయండి!

Jio Recharge Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఏప్రిల్ 15వరకు పొడిగించింది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడమే.. ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?

Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 15వరకు జియోహాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు.. ఇప్పుడే ఇలా చేయండి!

Jio Cheapest Plan

Updated On : April 3, 2025 / 5:22 PM IST

Jio Recharge Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు క్రికెట్ ఫ్యాన్ అయితే ఇది మీకోసమే.. మీ ఫోన్‌లో IPL 2025 ఉచితంగా వీక్షించవచ్చు. ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో జియోహాట్‌స్టార్ (JioHotstar) ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది.

Read Also : Lava Bold 5G : తగ్గేదేలే.. దిమ్మతిరిగే ఫీచర్లతో స్వదేశీ లావా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. చైనా ఫోన్లు జుజుబీ.. ధర కూడా చాలా తక్కువే..!

అంటే.. నిర్దిష్ట రీఛార్జ్ ప్లాన్‌లతో జియో ఫోన్ నంబర్‌లను రీఛార్జ్ చేయడం ద్వారా కస్టమర్‌లు ఉచితంగానే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ 2025 లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. గతంలోనే ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టగా ఇప్పుడు ఏప్రిల్ 15వరకు పొడిగించింది.

జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్లాన్‌లివే :
రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే జియో యూజర్లకు 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలలో కూడా యాక్సెస్ చేయవచ్చు. కస్టమర్లు 50 రోజుల పాటు ఫ్రీ జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ను కూడా పొందవచ్చు.

రూ. 299 జియో రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే.. కస్టమర్లు 28 రోజుల పాటు రోజుకు 1.5GB 4G డేటాను కూడా పొందవచ్చు. జియో హాట్‌స్టార్ యాక్సెస్ కూడా పొందవచ్చు. మీకు ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉంటే.. మీ ఫోన్ నంబర్లకు లింక్ చేసిన అదే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ.100 చెల్లించవచ్చు.

Read Also : Apple iPhone 13 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.17వేలకే కొత్త ఐఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలివే :
మీరు (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌ను వేరుగా తీసుకుంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. 3 నెలల మొబైల్-ఓన్లీ ప్లాన్. అంతేకాదు.. కంపెనీ రూ.299 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది 3 నెలల సూపర్ ప్లాన్. జియో కస్టమర్లు రూ.499 ప్రీమియం ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఇందులో 4K కంటెంట్ యాక్సెస్‌తో పాటు పూర్తిగా యాడ్స్ లేకుండా చూడొచ్చు.