PPF Nominees Update : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై PPF అకౌంట్లలో నామినీలను అప్‌డేట్ చేస్తే.. ఎలాంటి ఛార్జీలు ఉండవు.. ఫుల్ డిటెయిల్స్..!

PPF Nominees Update : పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై నామినీలను కొత్తగా చేర్చినా లేదా సవరణలు చేసినా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

PPF Nominees Update : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై PPF అకౌంట్లలో నామినీలను అప్‌డేట్ చేస్తే.. ఎలాంటి ఛార్జీలు ఉండవు.. ఫుల్ డిటెయిల్స్..!

PPF Account Holders

Updated On : April 3, 2025 / 8:51 PM IST

PPF Nominees Update : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లక్షలాది మంది ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పీపీఎఫ్ అకౌంట్లలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పీపీఎఫ్ నామినీల అప్‌డేట్ లేదా చేర్పులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

Read Also : Ola Electric : ఓలా ‘హైపర్ డెలివరీ’ అదుర్స్.. ఇకపై కొన్న రోజే ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇంటికి తీసుకెళ్లొచ్చు.. పండగ చేస్కోండి..!

PPF అకౌంట్ నామినీ అప్‌డేట్ ఫీజు :
PPF అకౌంట్లలో నామినీ వివరాలను అప్‌డేట్ చేయడం లేదా ఎడిట్ చేయడానికి ఆర్థిక సంస్థలు రూ. 50 రుసుము వసూలు చేస్తాయని సమాచారం అందింది. అయితే, PPF అకౌంట్లలో నామినీల అప్‌డేట్‌పై ఛార్జీలను తొలగించేందుకు ఏప్రిల్ 2, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ సేవింగ్ ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లో అవసరమైన మార్పులు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే ఈ చిన్న పొదుపు పథకాలకు నామినీ రద్దు లేదా మార్పు కోసం PPF ఖాతాదారులు ఇకపై రూ.50 రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

PPFలో ఎంత మంది నామినీలంటే? :
ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సేఫ్ కస్టడీలో వస్తువులు, సేఫ్టీ లాకర్ల చెల్లింపు కోసం గరిష్టంగా 4 మంది వ్యక్తులను నామినీలుగా ఉండేందుకు అనుమతిస్తుంది.

ఈ పరిమితిని దాదాపు 6 దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచాలని కోరుతున్నారు. రాజ్యాంగ (97వ సవరణ) చట్టం, 2011కి అనుగుణంగా సహకార బ్యాంకులలో డైరెక్టర్ల పదవీకాలాన్ని (ఛైర్మన్, ఫుల్ టైమ్ డైరెక్టర్ మినహా) 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలని కూడా చట్టం చెబుతోంది.

Read Also : Nissan Magnite Car : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ నిస్సాన్ కారుపై ఏకంగా రూ.65 వేలు డిస్కౌంట్.. గోల్డ్ కాయిన్ ఫ్రీ.. డోంట్ మిస్..!

PPF వడ్డీ రేటు :
ప్రభుత్వం అందించే PPF పథకం వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా అందిస్తుంది. ఇటీవలి ప్రభుత్వ పీపీఎఫ్ రేట్ల ప్రకారం.. ఈ పథకం పెట్టుబడిదారులు PPF ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.