MG Majestor Launch
MG Majestor Launch : భారత ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఇప్పుడు కొత్త, ప్రీమియం ఎస్‌యూవీ ఎంజి మెజెస్టర్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కొత్త ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ ఫిబ్రవరి 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
ఈ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందు కంపెనీ ఈ ఎస్‌యూవీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. ఎంజీ మెజెస్టర్ ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ మించి ఫీచర్లతో రాబోతుంది. ఈ బ్రాండ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎంజీ మెజెస్టర్ లుక్స్, డిజైన్ (అంచనా) :
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ లుక్స్, డిజైన్ విషయానికి వస్తే.. కొత్త SUV బోల్డ్, మస్క్యులర్ లుక్ అందిస్తుంది. SUV ఫ్రంట్ సైడ్ భారీ మ్యాట్రిక్స్-స్టైల్ గ్రిల్ ఉంది. దీనికి ప్రీమియం, అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది. క్షితిజ సమాంతర, వర్టికల్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కూడా అందిస్తుంది. కారు సైడ్ ప్రొఫైల్‌లో భారీ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెడల్పు గల వీల్ ఆర్చ్‌లు, స్ట్రాంగ్ బాడీ డిజైన్ ఉన్నాయి.
ఎంజీ మెజెస్టర్ ఫీచర్లు :
కొత్త ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీలో ఫీచర్ల పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. ఒకసారి లాంచ్ అయ్యాక మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొత్త ఎంజీ మెజెస్టర్ అనేక అడ్వాన్స్, ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు.
ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 12-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, లెవల్ 2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు ఉండవచ్చు.
ఎంజీ మెజెస్టర్ ఇంజిన్ :
ఇంజిన్ల విషయానికి వస్తే.. ఎంజీ మెజెస్టర్ 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ సుమారుగా 212.5bhp, 478.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ SUV ఆప్షనల్ ఫోర్-వీల్ డ్రైవ్ (4WD)తో బ్యాక్ వీలర్ డ్రైవ్ కూడా అందించవచ్చు.