CIBIL Score : ఒక్క రోజు EMI మిస్ అయితే CIBIL స్కోర్ తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
CIBIL Score : లోన్ ఈఎంఐ ఒక్క రోజు మిస్ అయినా సిబిల్ స్కోరు దెబ్బతింటుందా? అసలు ఏయే సందర్భాల్లో క్రెడిట్ స్కోరు పడిపోతుంది? పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- July 3, 2026 / 05:54 PM IST
CIBIL Score
- ఈఎంఐ ఒక్క రోజు లేటుగా కట్టినా సిబిల్ స్కోరు దెబ్బతింటుందా?
- బ్యాంకులు ఇలా చేస్తే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్టు చేయవు
- 3 రోజుల నుంచి 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది
CIBIL Score : ప్రతినెలా లోన్ ఈఎంఐ కడుతున్నారా? అయితే కొన్నిసార్లు ఈఎంఐ కట్టడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఒక్కోసారి ఏదో కారణం చేత గడువు తేదీలోగా కట్టాల్సిన ఈఎంఐ ఆలస్యం కావొచ్చు. అది ఒక్క రోజైనా అవ్వొచ్చు..
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. సిబిల్ స్కోరు దెబ్బతింటుందా? ఒక్క రోజు ఈఎంఐ కట్టడం (CIBIL Score) ఆలస్యమైనా సిబిల్ స్కోరు ఎక్కడ పడిపోతుందోనని తెగ వర్రీ అయిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీతం పడకపోవడం, ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు, సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం కారణంగా ఈఎంఐ ఒక రోజు మిస్ అవ్వడం ఇలా చాలా మందికి ఎదురువుతూనే ఉంటుంది.
అప్పుడు అందరి మనసులో ఒకటే భయం.. నా క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ ఉంటుందా? వాస్తవానికి, ఒక్క రోజు ఈఎంఐ ఆలస్యంగా కట్టినంత మాత్రానా మీ క్రెడిట్ స్కోర్ పడిపోదు. సాధారణంగా బ్యాంకులు ఈఎంఐ మిస్ అయిన వెంటనే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయవు. చాలా సందర్భాల్లో 3 రోజుల నుంచి 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ లోపల మీరు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు.
కానీ, ఆ ఈఎంఐ అలాగే కట్టకుండా ఉండిపోతే.. బ్యాంక్ మీపై ఆలస్య రుసుములు, బౌన్స్ ఛార్జీలు వేస్తుంది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కూడా పంపుతుంది. ప్రారంభంలో ఏదో కారణంగా ఆలస్యమైందనే బ్యాంకు భావిస్తుంది. అయితే, అసలు సమస్య ఎప్పుడొస్తుందో తెలుసా?
30 రోజులు దాటిన తర్వాత బ్యాంకు మీ ఈఎంఐ మిస్ అయిన విషయం బ్యాంక్ క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీ సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారి ఆలస్య చెల్లింపు రిపోర్ట్ అయితే.. స్కోర్ 50 పాయింట్ల నుంచి 100 పాయింట్లు వరకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయినా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇది పర్మినెంట్ లాస్ కాదని గుర్తించాలి. మీరు ఆ తర్వాత నుంచి రెగ్యులర్ ఈఎంఐలు సరిగా చెల్లిస్తుంటే మీ క్రెడిట్ స్కోర్ మళ్లీ పెరగడం మొదలువుతుంది. రీపేమెంట్ హిస్టరీ సరిగా ఉంటే మీరు క్రమశిక్షణతో బిల్లు చెల్లిస్తున్నారని బ్యాంక్ భావిస్తుంది. మీ బిల్ పేమెంట్ విధానంపై నెమ్మదిగా బ్యాంకులకు నమ్మకం పెరుగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. మీకు ఏదైనా సమస్య వచ్చిన వెంటనే దాచిపెట్టకుండా పరిష్కరించుకోవాలి. బ్యాంక్‌కి అసలు విషయం చెప్పి కొంత సమయం అడగడం లేదంటే వెంటనే బకాయి చెల్లించడం ఎంతైనా మంచిది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఒక్క రోజు ఈఎంఐ మిస్ అవ్వడంతో సమస్య ఉండదు కానీ అలానే నిర్లక్ష్యం చేస్తేనే పెద్ద సమస్యగా మారుతుంది.
