Monsoon Driving Tips : వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!
Monsoon Driving Tips : వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. తడి రోడ్లపై వేగంగా వెళ్లడం, వరద నీటితో నిండిన దారులను దాటడం, లైట్లు వేయకపోవడం, టైర్లు అరిగిపోవడం వంటి పొరపాట్లన్నీ ప్రమాదాలకు దారితీస్తాయి.
- Sreehari A
- Published on- August 8, 2026 / 10:20 PM IST
Monsoon Driving Tips
- వర్షంలో కారు నడిపే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలివే
- వర్షంలో కారు స్కిడ్ అవ్వడానికి ప్రధాన కారణాలివే
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే
Monsoon Driving Tips : అసలే వర్షాకాలం.. జోరుగా వర్షాలు పడుతున్నాయి. బయటకు అడుగుపెట్టడమే కష్టం.. ఇలాంటి జోరువానలో మీ కారు బయటకు తీస్తున్నారా? జర జాగ్రత్త.. అందులోనూ కొండ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఈ వర్షం కురిసే సమయంలో వాహనదారులు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా రోడ్లు తడిసి, అనేక ప్రాంతాలు జలమయమవుతాయి. ఇటువంటి పరిస్థితులలో, వాహనం నడిపేటప్పుడు చేసే చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల, వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
కారును అధిక వేగంతో నడపడం :
వర్షం పడినప్పుడు రోడ్లు తడిగా ఉంటాయి. తద్వారా మీ కారు టైర్ల పట్టు తగ్గుతుంది. అధిక వేగంతో వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల కారు జారిపోయే రిస్క్ పెరుగుతుంది. అందుకే వర్షంలో ఎల్లప్పుడూ నెమ్మదిగా జాగ్రత్తగా వాహనం నడపండి. అలాగే, అవసరమైతే సమయానికి బ్రేకులు వేసేలా వీలుగా ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించండి.
వరదతో పొంగే రహదారిపై కారు నడపడం :
వర్షాకాలంలో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోతాయి. నీటి లోతు తెలుసుకోకుండా ఈ ప్రాంతాల్లోకి మీ కారును నడపడం అత్యంత ప్రమాదకరం. నీరు ఇంజిన్‌లోకి చేరి, కారు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. భారీగా నీరు ఉన్న రోడ్లకు దూరంగా ఉండండి.
Read Also : Aadhaar App PIN : మీ ఆధార్ యాప్ PIN మర్చిపోయారా? మీ ఇంట్లోనే జస్ట్ 5 నిమిషాల్లో కొత్త పిన్ రీసెట్ చేయొచ్చు!
లైట్లు, ఇండికేషన్లను వాడకపోవడం :
వర్షం పడుతున్నప్పుడు ఆకాశం చీకటిగా మారి కనిపించేది తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ కారు లైట్లు వేయకపోవడం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
వర్షం పడుతున్నప్పుడు మీ కారు లైట్లను ఆన్ చేసి ఉంచండి. తద్వారా మీ ఫ్రంట్, బ్యాక్ ఉన్న వాహనాలు మీ కారును ఈజీగా చూడొచ్చు. టర్నింగ్ తిరిగే ముందు ఎల్లప్పుడూ మీ ఇండికేటర్లను ఆన్ చేయండి. అద్దంలో చూశాకే తర్వాతే డైరెక్షన్ మార్చండి.
టైర్లను చెక్ చేయకపోవడం :
వర్షంలో మీ కారు టైర్లు జారుతుంటాయి. పాత లేదా పట్టు తక్కువగా ఉన్న టైర్ల వల్ల తడి రోడ్లపై మీ కారును కంట్రోలింగ్ ఉండదు.
అందుకే వర్షాకాలంలో మీ కారు నడిపే ముందు మీ టైర్లను తప్పకుండా చెక్ చేయించుకోండి. మీ టైర్లు బాగా అరిగిపోయి ఉంటే.. వెంటనే మార్చడం బెటర్. వర్షాలలో సురక్షితంగా డ్రైవింగ్ చేసేందుకు కొద్దిపాటి జాగ్రత్త చాలు. సరైన స్పీడ్, మంచి టైర్లు, అవసరమైన సేఫ్టీ రూల్స్ పాటించాలి. తద్వారా సేఫ్ గా ఇంటికి తిరిగి వెళ్లొచ్చు.
