Motor Insurance Rules : వాహనదారులకు రెడ్ అలర్ట్! వర్షాల్లో ఈ రూల్స్ పాటించకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావు..!
Motor Insurance Rules : వర్షాకాలంలో మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు భారీగాపెరుగుతున్నాయి. వరదల్లో వాహన నష్టంపై స్టాండర్డ్ పాలసీలు ఏమేమి కవర్ చేస్తాయి? అవసరమైన యాడ్-ఆన్ ఏంటో తప్పక తెలుసుకోండి.
- Sreehari A
- Updated on- July 29, 2026 / 02:40 PM IST
Motor Insurance Rules
- వరదల్లో వాహనం మునిగిందా? ఒక్క నిర్లక్ష్యం.. లక్షల నష్టం!
- మోటార్ ఇన్సూరెన్స్ ఉందని రిలాక్స్ అవుతున్నారా?
- వర్షాకాలంలో ఈ మిస్టేక్ చేస్తే మీకు ఒక్క పైసా కూడా రాదు
- ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే ఈ రూల్స్ తప్పనిసరి పాటించాలి
Motor Insurance Rules : బాబోయ్.. అసలే వర్షాకాలం.. వానలు దంచికొడుతున్నాయి. బండి బయటకు తీయాలంటేనే భయడాల్సిన పరిస్థితి. అయినా చాలామంది వాహనదారులు తమ బైకులు, స్కూటర్లను నడుపుతుంటారు. వరదల సమయంలో రోడ్లపై వర్షనీరు చేరి చాలా నగరాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలు తరచుగా నీటిలో చిక్కుకోవడం, ఇంజిన్లు ఆగిపోవడం, ప్రమాదాలు జరగడం జరుగుతుంటాయి.
అయితే, వాహనదారులు తమకు మోటార్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనే ధీమాగా ఉంటారు. ఇలాంటి వాహన (Motor Insurance Rules) నష్టాలన్నింటికీ మోటార్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందనే భావన చాలా మంది వాహనదారుల్లో కనిపిస్తుంటుంది. కానీ, వాస్తవానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్ని కీలక నిబంధనలు తప్పక తెలుసుకుని ఉండాలి. లేదంటే వాహన నష్టం సమయంలో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
వర్షాకాలంలో వాహన బీమా క్లెయిమ్‌లు భారీగా పెరుగుతాయి. వరదలు, జారే రోడ్ల కారణంగా ఎక్కువ వాహనాలు పాడవడం, ప్రమాదాలు జరుగుతాయి. వర్షాకాలంలో మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లలో భారీగా పెరుగుదలను చూస్తాయి.
వర్షాకాలంలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కాల్స్ సుమారు 25 శాతం నుంచి 35శాతం మేర పెరుగుతాయి. సగటు క్లెయిమ్ మొత్తాలు కూడా దాదాపు మూడింట ఒక వంతు అంటే రూ. 30వేల నుంచి రూ. 40వేల వరకు ఖర్చు పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం.. నీటి వల్ల కలిగే నష్టానికి సంబంధించిన రిపేర్లు చాలా ఖరీదైనవిగా మారడమే..
ప్రతి వరద నష్టం కవర్ కాదు :
జనరల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే కవర్ చేస్తుంది. ప్రతి సందర్భంలోనూ బీమా పరిహారం లభించదు. ముఖ్యంగా వరద నీటిలో వాహనం ఆగిపోతే ఇంజిన్ మళ్లీ మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించొద్దు. ఇలా చేస్తే ఇంజిన్ దెబ్బతింటుంది. దాన్ని‘కాన్సిక్వెన్షియల్ డ్యామేజ్’గా చెబుతారు. ఇలాంటి వాహన నష్టాలకు జనరల్ మోటార్ పాలసీలో క్లెయిమ్ అప్రూవల్ రాకపోవచ్చు.
ఇంజిన్ ప్రొటెక్ట్ లేదంటే భారీ నష్టం :
బైక్ లేదా స్కూటర్ ఇంజిన్‌లోకి వరద నీరు చేరి హైడ్రోస్టాటిక్ లాక్ ఏర్పడొచ్చు. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య ఇదే. ఇలాంటి నష్టాలకు పరిహారం పొందాలంటే పాలసీలో ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ ఉండాలి. అలాగే, జీరో డిప్రిసియేషన్ కవర్, కన్స్యూమబుల్స్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ వంటి యాడ్-ఆన్‌లు ఉండాలి. వరదల సమయంలో అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.
పాలసీలో ఇవి కవర్ కాకపోవచ్చు :
వాహనాల్లో సాధారణ అరుగుదల, మెకానికల్, ఎలక్ట్రికల్ లోపాలు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, వ్యాలీడ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం ద్వారా జరిగిన ఏదైనా నష్టాలకు సాధారణంగా ఇన్సూరెన్స్ వర్తించదు. అలాగే ఇంజిన్ ఆయిల్, కూలెంట్, లూబ్రికెంట్లు వంటి కన్స్యూమబుల్ వస్తువులకు ప్రత్యేక కవర్ తీసుకోవాలి. లేదంటే వీటి నష్టంపై కూడా ఖర్చును వాహనదారుడే భరించాల్సి వస్తుంది.
క్లెయిమ్ మందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
ఒకవేళ వరద నీటిలో మీ వాహనం ఆగిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజిన్‌ను మళ్లీ స్టార్ట్ చేయొద్దు. ఆ తర్వాత వెంటనే టో చేసి ఏదైనా అధికారిక గ్యారేజీకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత బీమా సంస్థకు కూడా దీనిపై సమాచారం ఇవ్వాలి. వాహనం దెబ్బతిన్న ఫొటోలు తీయాలి. సర్వేయర్ పరిశీలన పూర్తయ్యే వరకు ఎలాంటి పెద్ద రిపేర్లు చేయకూడదు. ఇలా చేస్తే క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఈజీగా పూర్తి అవుతుంది.
వర్షాకాలానికి ముందు ప్రతి వాహనదారుడు తమ వాహనం టైర్లు, బ్రేకులు, బ్యాటరీ, వైపర్లు, లైట్లు వంటివి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో మోటార్ బీమా పాలసీలో కవరేజ్‌తో పాటు అవసరమైన యాడ్-ఆన్‌లు ఉన్నాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. తద్వారా భవిష్యత్తులో వాహనదారులకు లక్షల రూపాయల నష్టం నుంచి బయటపడొచ్చు.
