Telugu » Business » Motorola Edge 50 Fusion Available For Under Rs 18k On Flipkart Check Deal Details Here Sh
Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అతి చౌకైన ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!
Motorola Edge 50 Fusion : అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన వెంటనే మరో కొత్త ఫెస్టివ్ ధమాకా సేల్ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా అద్భుతమైన డీల్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీరు స్టైలిష్ మోటోరోలా ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసేందుకు బెస్ట్ టైమ్.
2/7
ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది తద్వారా ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 18వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.18,999కి అందుబాటులో ఉంది. అంటే.. ఈ-కామర్స్ దిగ్గజం ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై రూ.4వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పేమెంట్ కోసం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
4/7
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది.
5/7
హుడ్ కింద, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. అడ్రినో 710 జీపీయూ కలిగి ఉంది. మోటోరోలా ఫోన్ 12జీబీ వరకు LPDDR4X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బ్యాక్ సైడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.
7/7
ఫ్రంట్ సైడ్ మోటోరోలా ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది. ఇంకా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది.