Motorola Edge 50 Pro : వారెవ్వా.. డిస్కౌంట్ అదిరింది.. అతి తక్కువ ధరకే కొత్త మోటోరోలా ప్రో ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు..!

Motorola Edge 50 Pro : మోటోరోలా అభిమానుల కోసం సూపర్ డిస్కౌంట్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Motorola Edge 50 Pro : వారెవ్వా.. డిస్కౌంట్ అదిరింది.. అతి తక్కువ ధరకే కొత్త మోటోరోలా ప్రో ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు..!

Motorola Edge 50 Pro

Updated On : June 10, 2025 / 6:16 PM IST

Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో రూ.30వేల లోపు స్మార్ట్‌ఫోన్ కోసం (Motorola Edge 50 Pro) చూస్తుంటే ఇదే బెటర్ టైమ్.. క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆకర్షణీయమైన డిజైన్, ఆకట్టుకునే కెమెరా, బ్రైట్ నెస్ డిస్‌ప్లేతో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది.

Read Also : Google Pixel 9 Pro : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన పిక్సెల్ 9 ప్రో సిరీస్.. ఇంత తక్కువలో వస్తుంటే కొనకుండా ఉండలేరు!

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ కొనుగోలుపై ధర, బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.7,250 వరకు తగ్గింపు పొందవచ్చు. భారత మార్కెట్లో రూ.35,999కి లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 12GB ర్యామ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,800 కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర :
ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50ప్రో (Motorola Edge 50 Pro) రూ.29,999 ధరకు లభిస్తుంది. లాంచ్ ధర కన్నా రూ.6వేలు తక్కువ. HDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కస్టమర్లు రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లు ఈ మోటోరోలా ఫోన్ నెలకు రూ.1,454 నుంచి ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కూడా పొందవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. వర్కింగ్ కండిషన్, వేరియంట్ ఆధారంగా రూ. 28వేల వరకు వాల్యూను పొందవచ్చు. కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీతో పాటు ప్రొటెక్షన్ ప్లాన్ కూడా పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K pOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : PM Kisan Yojana : బిగ్ అలర్ట్.. ఈ రైతులకు పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు పడవు.. ఇప్పుడే ఈ పని పూర్తి చేయండి..!

125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 50MP OIS ప్రైమరీ షూటర్‌తో పాటు 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. ఈ మోటోరోలా 50MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.