PM Kisan Yojana : బిగ్ అలర్ట్.. ఈ రైతులకు పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు పడవు.. ఇప్పుడే ఈ పని పూర్తి చేయండి..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు పడాలంటే వెంటనే ఈ పనులను పూర్తి చేయండి.. లేదంటే డబ్బులు ఖాతాలో జమ కావు..

PM Kisan 20th Installment
PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశంలోని కోట్లాది మంది రైతులకు త్వరలో శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత (PM Kisan Yojana) అతి త్వరలో విడుదల కానుంది. లబ్ధిదారు రైతులంతా ఈ 20వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అర్హత కలిగిన రైతులందరికి రూ. 2వేలు బ్యాంకు ఖాతాలో జమ కానుంది. నివేదికల ప్రకారం.. జూన్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం 20వ విడతను విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
ఈ వాయిదా రాకముందే రైతులు కొన్ని కీలకమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు అందాల్సిన రూ. 2వేలు ఆగిపోతాయి. వాయిదా డబ్బు నిలిచిపోతుంది. ఇంతకీ ఏయే పనులు పూర్తి చేయాలి? అనేదానిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుతానికి 20వ వాయిదా జమ చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈలోపు లబ్ధిదారు రైతులు ఏయే పనులను పూర్తి చేయాలో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
రైతులు ekyc వెంటనే పూర్తి చేయాలి :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Yojana)ను సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా KYC ప్రక్రియను పూర్తి చేయాలి. e-KYC పూర్తి కాకపోతే.. రైతులు 20వ విడత పొందలేరు. మీరు e-KYCని ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
e-KYC ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలి? :
- అధికారిక PM-Kisan వెబ్‌సైట్ (pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
- ‘Farmer Corner’కి వెళ్లి ‘e-KYC’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ‘Search’పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేయండి.
- రైతు ఆధార్ కార్డుకు లింక్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- మీ e-KYC అప్‌డేట్ కోసం OTP ఎంటర్ చేయాలి.