Google Pixel 9 Pro : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన పిక్సెల్ 9 ప్రో సిరీస్.. ఇంత తక్కువలో వస్తుంటే కొనకుండా ఉండలేరు!

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ భారీగా తగ్గింది. ఏకంగా రూ. 24వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 9 Pro : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన పిక్సెల్ 9 ప్రో సిరీస్.. ఇంత తక్కువలో వస్తుంటే కొనకుండా ఉండలేరు!

Google Pixel 9 Pro

Updated On : June 10, 2025 / 4:39 PM IST

Google Pixel 9 Pro : మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో అత్యంత ఖరీదైన గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీ పాత ఫోన్(Google Pixel 9 Pro) అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.. గూగుల్ హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్‌ ఈ డీల్ ద్వారా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Vivo X200 FE leaks : కొత్త వివో ఫోన్ కేక.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్.. భలే ఉంది కదా.. ఓసారి లుక్కేయండి..!

గూగుల్ పిక్సెల్ 9 ప్రో డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ రూ.1,09,999కు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫోన్ రూ.89,999కు లిస్ట్ అయింది. రిటైలర్ పిక్సెల్ 9 ప్రోపై రూ.20వేలు నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. వన్ కార్డ్ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.

పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 6.3-అంగుళాల (LTPO) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3వేల నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్‌ను అందిస్తుంది.

Read Also : iQOO Anniversary Sale 2025 : ఐక్యూ వార్షికోత్సవ సేల్.. ఈ ఐక్యూ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రోలో 50MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.