Vivo X200 FE leaks : కొత్త వివో ఫోన్ కేక.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్.. భలే ఉంది కదా.. ఓసారి లుక్కేయండి..!

Vivo X200 FE leaks : వివో కొత్త X200 FE ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే కీలక ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి.

Vivo X200 FE leaks : కొత్త వివో ఫోన్ కేక.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్.. భలే ఉంది కదా.. ఓసారి లుక్కేయండి..!

Vivo X200 FE leaks

Updated On : June 10, 2025 / 3:25 PM IST

Vivo X200 FE leaks : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో సరికొత్త X200 FE ఫోన్ తీసుకొస్తోంది. X200 సిరీస్ లైనప్‌ను కొత్త ఫ్యాన్ ఎడిషన్ వేరియంట్‌తో విస్తరించేందుకు (Vivo X200 FE leaks) రెడీ అవుతోంది. వివో X200 FE పేరుతో లాంచ్ చేయనుంది. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

Read Also : iPhone 17 Series : iOS 26తో ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది.. సూపర్ ఏఐ స్మార్ట్ ఫీచర్లు.. ఏయే ఐఫోన్లు సపోర్టు చేస్తాయంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

ఈ ఫోన్ వివో S30 ప్రో మినీ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుంది. చిప్‌సెట్, కెమెరాలు, ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో పాటు అన్నీ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఉన్నాయి. రాబోయే వివో X200 FE డిజైన్, స్పెసిఫికేషన్లు, కెమెరా, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

వివో X200 FE భారత్ లాంచ్ టైమ్‌లైన్ (లీక్) :
వివో రాబోయే X200 FE లాంచ్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ఇటీవల BIS లిస్టులో కనిపించింది. అతి త్వరలో లాంచ్ అవుతుందని సూచించింది. ఈ ఏడాది జూలైలో వివో X200 FE లాంచ్ కానుందని నివేదికలు సూచించాయి. అయితే, ప్రస్తుతానికి కచ్చితమైన లాంచ్ తేదీ తెలియదు.

వివో X200 FE స్పెసిఫికేషన్లు (లీక్) :
వివో X200 FE రీబ్రాండెడ్ వెర్షన్ వివో S30 ప్రో మినీ మాదిరి ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.31-అంగుళాల 1.5K 8T ఎల్టీపీఓ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.

హుడ్ కింద, హ్యాండ్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 9300+ SoCతో అమర్చి ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ బ్యాక్ సైడ్ 50MP IMX921 OIS, 8MP అల్ట్రావైడ్, 50MP 2x టెలిఫోటో సెన్సార్‌ను అందిస్తుంది. ఇంకా, 6,500mAh బ్యాటరీతో 90W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని అంచనా.

Read Also : Motorola Edge 60 Launch : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. మీ బడ్జెట్ ధరలో మోటోరోలా ఎడ్జ్ 60 వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

వివో X200 FE ధర (లీక్) :
నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో వివో X200 FE ఫోన్ ధర దాదాపు రూ.50వేల వరకు ఉండవచ్చు. వివో S30 ప్రో మినీ ధర సుమారు రూ. 41,500 వద్ద లాంచ్ అయింది.