Motorola Edge 60 Launch : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. మీ బడ్జెట్ ధరలో మోటోరోలా ఎడ్జ్ 60 వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Motorola Edge 60 Launch : మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లతో మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్ కలిగి ఉంది. ధర కూడా చాలా తక్కువే..

Motorola Edge 60 Launch
Motorola Edge 60 Launch : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 60 అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (Motorola Edge 60 Launch) మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లతో లభ్యం కానుంది. ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్, కర్వ్డ్ 1.5K pOLED డిస్‌ప్లే, ఆన్-డివైస్ ఏఐ టూల్స్‌ను రూ. 24,999 ప్రారంభ ధరకు అందిస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ అన్ని లెన్స్‌లపై 4K రికార్డింగ్, IP68/IP69 రేటింగ్‌లు, మెరుగైన సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లను అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50తో పోలిస్తే.. ఈ మోటోరోలా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ధర, స్పెసిఫికేషన్‌లు, లభ్యతకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 6.7-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ పోల్‌ఇడీ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 5,500mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మోటోరోలా హలో యూఐతో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది.

Motorola Edge 60 Launch
ముఖ్య ఫీచర్లలో ఇమేజ్ స్టూడియో, MIL-STD-810H, గొరిల్లా గ్లాస్ 7i, IP68/IP69 రేటింగ్‌లు, డాల్బీ అట్మాస్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు వంటి motoAI టూల్స్ ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP మెయిన్ (OISతో సోనీ LYTIA 700C), 50MP అల్ట్రావైడ్/మాక్రో, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో, 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ధర ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.25,999 ఉండగా, బ్యాంక్ ఆఫర్లతో రూ.24,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 17, 2025 నుంచి Flipkart, Motorola.in, భారత్ అంతటా రిటైల్ స్టోర్‌లలో లభ్యమవుతుంది.
అదనంగా, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఇప్పుడు కొత్త పాంటోన్ మైకోనోస్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. 8GB + 256GB మోడల్‌కు రూ. 21,999, 12GB + 256GB వెర్షన్‌కు రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 13 నుంచి సేల్ మొదలు కానుంది.