iPhone 17 Series : iOS 26తో ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది.. సూపర్ ఏఐ స్మార్ట్ ఫీచర్లు.. ఏయే ఐఫోన్లు సపోర్టు చేస్తాయంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ iOS 26తో లాంచ్ కానుంది. ఏఐ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సపోర్టు చేసే ఐఫోన్ల లిస్ట్ మీకోసం..

iPhone 17 Series : iOS 26తో ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది.. సూపర్ ఏఐ స్మార్ట్ ఫీచర్లు.. ఏయే ఐఫోన్లు సపోర్టు చేస్తాయంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

iPhone 17 Series

Updated On : June 10, 2025 / 1:26 PM IST

iPhone 17 Series : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. అయితే, ఈ కొత్త ఐఫోన్ సిరీస్‌లో iOS 26 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా (iPhone 17 Series) ఉంటుంది. ఆపిల్ వార్షిక ఈవెంట్ WWDC 2025లో iOS 26 అధికారికంగా ప్రవేశపెట్టింది.

ఈసారి కొత్త అప్‌డేట్ మాత్రమే కాదు.. మరెన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ “లిక్విడ్ గ్లాస్” థీమ్, లేటెస్ట్ డిజైన్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. గతంలో చివరిగా iOS 7లో మార్పు కనిపించింది. ఆ తర్వాత iOS 26తో సరికొత్త ఫీచర్లను అందించనుంది.

Read Also : WWDC 2025 : ఆపిల్ కొత్త iOS 26 అప్‌డేట్ ఆగయా.. ఫీచర్లు అదుర్స్.. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సపోర్టు చేసే మోడల్స్ ఇవే..!

ఈసారి ఆపిల్ ఇన్‌బిల్ట్ యాప్‌లన్నింటికీ కొత్త డిజైన్, కొన్ని స్మార్ట్ ఫీచర్‌లను చేర్చింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. iOS 26లో ఆపిల్ ఇంటెలిజెన్స్ అనేది మీ ఐఫోన్‌ను మరింత స్మార్ట్‌గా చేస్తుంది. మెసేజింగ్ అయినా, ఫోటో ఎడిటింగ్ అయినా లేదా సిరితో మాట్లాడటం అయినా ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఎప్పటిలాగే ఆపిల్ ఈసారి కూడా కొన్ని పాత ఐఫోన్‌లను జాబితా నుంచి మినహాయించింది.

ఈ పాత ఐఫోన్‌లకు iOS 26 అప్‌డేట్ రాదు :
iPhone Xs, iPhone Xs Max, iPhone XR వంటి ఐఫోన్ మోడల్‌లు iOS 26ని పొందలేవు. ఈ ఐఫోన్లు ప్రస్తుతం iOS 18లో రన్ అవుతున్నాయి.

ఈ ఐఫోన్‌లకు మాత్రమే iOS 26 సపోర్టు :
ఐఫోన్ 11 సిరీస్ నుంచి లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ వరకు అన్ని మోడళ్లకు iOS 26 అప్‌డేట్ లభిస్తుంది. మీ దగ్గర ఐఫోన్ 11, 12, 13, 14, 15 లేదా 16 సిరీస్ ఫోన్ ఉంటే.. కొత్త అప్‌డేట్ అందుకోవచ్చు. ఐఫోన్ SE (2వ, 3వ జనరేషన్) కొత్త ఐఫోన్ 16e కూడా ఈ అప్‌డేట్ అందుకోనున్నాయి. ఆపిల్ పాత మోడళ్లలో కూడా కొత్త ఫీచర్లు, డిజైన్ వంటివి సపోర్టు చేస్తాయి. పాత ఐఫోన్‌లను ఉపయోగిస్తున్న యూజర్లు iOS 26 కోసం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
iOS 26లో ఆపిల్ ఇంటెలిజెన్స్ AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు ప్రతి ఐఫోన్‌కి అందుబాటులో ఉండవు. ప్రస్తుతం, ఏఐ ఫీచర్లు సపోర్టు చేసే ఐఫోన్లలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లకు (ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మాక్స్, 16e) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీ మాటలను గతంలో కన్నా సిరి బాగా అర్థం చేసుకోవాలంటే.. ఫొటోలు ఆటోమాటిక్ ఎడిట్ చేయడం లేదా ఏదైనా స్మార్ట్ ఫీచర్ యాక్టివేట్ అవ్వాలి. ఇందుకోసం కొత్త ఐఫోన్ కలిగి ఉండాలి. ఏఐ ఫీచర్లకు అడ్వాన్స్ హార్డ్‌వేర్ అవసరమని ఆపిల్ స్పష్టంగా పేర్కొంది. కొత్త ఐఫోన్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read Also : LIC Saral Pension Plan : LIC సరళ్ పెన్షన్ ప్లాన్.. ఒకసారి చెల్లిస్తే చాలు.. జీవితాంతం పెన్షన్ పొందొచ్చు.. ప్రయోజనాలు, అర్హతలివే..!

ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ :
ఐఫోన్ 17 సిరీస్ అతి త్వరలో లాంచ్ కానుంది. iOS 26తోనే ఐఫోన్ 17 రానుంది. కొత్త ఐఫోన్‌లతో పాటు పాత అర్హత ఉన్న ఐఫోన్లు కూడా ఒక్కొక్కటిగా iOS 26 అప్‌డేట్ అందుకోనున్నాయి.
మీ ఐఫోన్‌ అప్‌డేట్ కోసం రెడీగా ఉంచుకోండి.